మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 25 అక్టోబరు 2024 (23:42 IST)

డోజీ సంచలనాత్మక అధ్యయనం: ఏఐ-ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ రోగి ఆరోగ్య పరిస్థితి అంచనా

Dozee
భారతదేశ ఆరోగ్య ఏఐ నాయకునిగా ఖ్యాతి గడించిన డోజీ, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన జర్నల్ ఫ్రాంటియర్స్ ఇన్ మెడికల్ టెక్నాలజీలో ప్రచురించబడిన తమ మైలురాయి అధ్యయనం యొక్క ఫలితాలను ఆవిష్కరించింది. ఈ జర్నల్ ప్రతిష్టాత్మక ఫ్రాంటియర్స్ గ్రూప్ లో భాగం. ఈ అధ్యయనం కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ (కెజిఎంయు)లో నిర్వహించబడింది, భారతీయ టెరిషియరీ కేర్లో ఈ తరహా అతిపెద్ద పరిశీలనా అధ్యయనాలలో ఇది ఒకటి. ఈ అధ్యయనం డోజీ యొక్క ఏఐ-శక్తివంతమైన ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ యొక్క సంచలనాత్మక ప్రభావాన్ని వెల్లడించింది, రోగి ఆరోగ్యం క్షీణించడాన్ని 16 గంటల ముందుగానే అంచనా వేయగల దాని సామర్థ్యాన్ని ఇది ప్రదర్శిస్తుంది, తద్వారా ముందస్తుగా జోక్యం చేసుకోవడానికి, ప్రాణాలను రక్షించడానికి ఒక క్లిష్టమైన అవకాశాన్ని ఆరోగ్య సంరక్షణ నిపుణులకు అందిస్తుంది.
 
దాదాపు 20 లక్షలు హాస్పిటల్ బెడ్‌లు ఉన్న దేశంలో, సాధారణ వార్డులలో సుమారు 1.9 మిలియన్ల మంది రోగులు పర్యవేక్షణ కోసం మాన్యువల్ స్పాట్ చెక్‌లపై ఆధారపడతారు, డోజీ యొక్క ఏఐ-పవర్డ్ రిమోట్ పేషెంట్ మానిటరింగ్, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (ఈడబ్ల్యుఎస్) ఒక విప్లవాత్మక పరిష్కారాన్ని అందిస్తుంది. ఈ సాంకేతికత 95% ఆసుపత్రి సామర్థ్యంలో సంరక్షణను మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది, ఐసియు సేవల ఖర్చులో స్వల్ప ఖర్చుతోనే ప్రపంచ-స్థాయి ఆరోగ్య సంరక్షణను నిర్ధారిస్తూ ప్రాణాలను కాపాడే నిరంతర పర్యవేక్షణను అందిస్తుంది.
 
ఈ మార్గదర్శక పరిశీలనా అధ్యయనం 85,000 గంటలలో 700 మంది రోగులను పర్యవేక్షించింది, డోజీ యొక్క నిరంతర కాంటాక్ట్‌లెస్ రిమోట్ పేషెంట్ మానిటరింగ్, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (ఈడబ్ల్యుఎస్ ) సాంప్రదాయ మాన్యువల్ ప్రక్రియలను ఎలా విప్లవాత్మకంగా మారుస్తుందో ప్రదర్శించింది. క్లిష్టమైన ఆరోగ్య సంఘటనలకు 16 గంటల ముందుగానే హెచ్చరికలను అందించడం ద్వారా, డోజీ వ్యవస్థ ఆరోగ్య సంరక్షణ నిపుణులను ముందుగా స్పందించటానికి అవకాశం ఇస్తుంది, ఇది ఆరోగ్య సంరక్షణ అభ్యాసకులకు స్టాఫ్ మెంబర్‌కు రోజుకు 2.4 గంటలు ఆదా చేస్తూ రోగి ఫలితాలను సైతం  మెరుగుపరుస్తుంది. హెచ్చరిక సున్నితత్వం, నిర్దిష్టత, ప్రారంభ హెచ్చరిక నుండి క్షీణత వరకు సగటు సమయం, ఆరోగ్య సంరక్షణ అభ్యాసకుల కార్యకలాపాలతో సహా కీలకమైన కొలమానాలను ఈ అధ్యయనం విశ్లేషించింది, ఇది డోజీ యొక్క ప్రాణాలను రక్షించే ప్రభావానికి బలమైన క్లినికల్ సాక్ష్యాలను అందిస్తుంది.
 
అనేక భారతీయ ఆసుపత్రులలో, నిరంతర పర్యవేక్షణ అనేది ఐసియులకు పరిమితం చేయబడింది, మెజారిటీ రోగులు ఉండే సాధారణ వార్డులు వదిలివేయబడుతున్నాయి. ఇక్కడ గుర్తించబడని క్లినికల్ క్షీణతకు రోగులు గురయ్యే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా హృదయ స్పందన రేటు, శ్వాసకోశ రేటు, రక్తపోటు వంటి ప్రాణాధారాలను నిరంతరం పర్యవేక్షించడం ద్వారా డోజీ యొక్క ఈడబ్ల్యుఎస్ ఈ అంతరాన్ని భర్తీ చేస్తుందని ఈ అధ్యయనం నిరూపిస్తుంది. ఫలితాలు వెల్లడించే దాని ప్రకారం డోజీ యొక్క ఈడబ్ల్యుఎస్ 67% నుండి 94% కేసులలో రోగి క్షీణతను అంచనా వేసింది, పరిస్థితులు క్లిష్టంగా మారడానికి ముందుగానే ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు జోక్యం చేసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఈ ముందస్తు గుర్తింపు సంవత్సరానికి 21 లక్షల మంది ప్రాణాలను కాపాడుతుంది. ఆరోగ్య సంరక్షణ ఖర్చులను రూ. 6400 కోట్లు వరకూ తగ్గించగలదు.
 
అధ్యయనం నుండి కీలక ఫలితాలు:
డోజీ యొక్క ఈడబ్ల్యుఎస్ రోగుల ఆరోగ్యం క్షీణించడం గురించి 16 గంటల ముందుగానే హెచ్చరించింది
నిరంతర పర్యవేక్షణ వల్ల ఆరోగ్య సంరక్షణ నిపుణుల సమయం 10% ఆదా అవుతుంది, ఇది రోజుకు 2.4 గంటలకు సమానం.
కెజిఎంయు వద్ద మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్ డాక్టర్ హిమాన్షు దండు మాట్లాడుతూ వనరుల-నియంత్రిత వాతావరణంలో క్లిష్టమైన సంరక్షణను మెరుగుపరచడంలో సాంకేతికత యొక్క సామర్థ్యాన్ని నొక్కి చెప్పారు. "ఈ వ్యవస్థ, ముందస్తుగా గుర్తించడం, నిరంతర రోగి పర్యవేక్షణను అనుమతిస్తుంది, భారీగా రోగి భారాన్ని ఎదుర్కొంటున్న ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల డిమాండ్‌లకు అనుగుణంగా కొలవదగిన, సరసమైన పరిష్కారాన్ని ఇది  అందిస్తుంది. రోగి ఆరోగ్యం క్షీణించే సంకేతాలను గుర్తించే సామర్థ్యం వారి మనుగడ రేటును గణనీయంగా మెరుగుపరుస్తుంది.." అని అన్నారు.