మగాళ్లూ... సంతాన యోగ్యతకు పనికొస్తారా? లేదా? ఇంట్లోనే పరీక్ష చేసుకోండి!
ప్రస్తుతం చాలా మంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. తమ భార్యల్లో ఉన్న లోపం వల్లే తమకు పిల్లలు పుట్టడం లేదని నిందలు మోపుతుంటారు. కానీ, సంతాన లోపం కేవలం మహిళల్లోనే ఉండదు. పురుషుల్లో కూడా ఉంటుంది.
ప్రస్తుతం చాలా మంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. తమ భార్యల్లో ఉన్న లోపం వల్లే తమకు పిల్లలు పుట్టడం లేదని నిందలు మోపుతుంటారు. కానీ, సంతాన లోపం కేవలం మహిళల్లోనే ఉండదు. పురుషుల్లో కూడా ఉంటుంది. పైగా, తమలో లోపం ఉందని తెలుసుకున్న పురుషులు ముందుకొచ్చి వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వెనుకంజ వేస్తుంటారు. ఇలాంటి వారికోసం ఓ సరికొత్త కిట్ అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల ఇంట్లోనే తమలో ఆ సత్తా ఉందో లేదో టెస్ట్ చేసుకోవచ్చు.
ఇంటివద్దనే మధుమేహం, గర్భ నిర్ధారణ పరీక్షలు ఏ విధంగా చేసుకుంటున్నారో.. అదేవిధంగా ఈ పరీక్షను కూడా చేసుకోవచ్చు. ఖర్చు కూడా చాలా తక్కువ. ఇందుకు సంబంధించిన కిట్‌ను తెలుగు శాస్త్రవేత్త రూపొందించారు. ముంబైలోని జాతీయ పునరుత్పాదన ఆరోగ్య పరిశోధన సంస్థ (ఎన్ఐఆర్ఆర్‌హెచ్) శాస్త్రవేత్త డాక్టర్ కేఎన్ఆర్‌రెడ్డి దీన్ని అభివృద్ధి చేశారు. రూ.100కే అందుబాటులో ఉండే ఈ కిట్ ద్వారా వందసార్లు పరీక్ష చేసుకోవచ్చు. అంటే ఒక పరీక్షకు రూపాయి మాత్రమే ఖర్చవుతుందన్నమాట. దేశంలో ఇటువంటి కిట్ అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి.
సాధారణంగా దేశ ప్రమాణాల ప్రకారం పురుషుల వీర్యంలో మిల్లీ లీటర్‌కు 60 మిలియన్ వీర్యకణాలు ఉండాలి. కనీసం 20 మిలియన్ కణాలున్నా సంతానం కలిగే అవకాశం ఉంటుంది. తాజాగా అభివృద్ధి చేసిన కిట్‌తో వైద్యుడి వద్దకు వెళ్లకుండానే సంతాన యోగ్యత ఉన్నదీ, లేనిదీ తెలుసుకోవచ్చు. ఒకవేళ తమలో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్నట్టు తేలితే ఆ తర్వాత వైద్యుడిని సంప్రదించవచ్చని ఐసీఎంఆర్ డిప్యూటీ డైరెక్టర్ రజనీకాంత్ శ్రీవాత్సవ పేర్కొన్నారు.