ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 26 నవంబరు 2022 (23:15 IST)

హైదరాబాద్‌లో తమ క్లీనిక్‌ను ప్రారంభించిన జస్లోక్‌ హాస్పిటల్‌

image
ముంబైలో అత్యంత ప్రాచుర్యం పొందిన జస్లోక్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ నేడు హైదరాబాద్‌లో తమ క్లీనిక్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. హైదరాబాద్‌లో ఫంక్షనల్‌ న్యూరో సర్జరీ పరంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ఫంక్షనల్‌ న్యూరోసర్జరీ, డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేషన్‌లో అపారమైన అనుభవం కలిగిన జస్లోక్‌ హాస్పిటల్‌ మెరుగైన చికిత్సనందించే రీతిలో ఈ క్లీనిక్‌ ద్వారా తమ కార్యకలాపాలు నిర్వహించనుంది.
 
జస్లోక్‌ హాస్పిటల్‌లో ఫంక్షనల్‌ న్యూరోసర్జరీ ఫౌండర్‌, డైరెక్టర్‌గా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న డాక్టర్‌ పరేష్‌ దోషి అత్యద్భుతమైన బృందాన్ని ఈ చికిత్సల పరంగా  తీర్చిదిద్దారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రోగ్రెసివ్‌ సుప్రాన్యూక్లియర్‌ పాల్సీ(పీఎస్‌పీ) సిండ్రోమ్‌తో బాధపడుతున్న రోగికి డీబీఎస్‌ శస్త్రచికిత్సను విజయవంతంగా చేసిన డాక్టర్‌ పరేష్‌ దోషి మెదడు లోపల ఎలక్ట్రోడ్లను అమర్చారు. ఈయన బృందంలో న్యూరో సర్జన్లు డాక్టర్‌ మనీష్‌ బల్డియా; డాక్టర్‌ నేహా రాయ్‌; డాక్టర్‌ రాజ్‌ అగర్‌బత్తివాలా; న్యూరోఫిజియాలజిస్ట్‌ డాక్టర్‌ సోనాలీ వాస్నిక్‌; న్యూరాలజిస్ట్‌ పెట్రౌసుప్‌ వాడియా; పార్కిన్‌సన్‌ కేర్‌ నర్స్‌ భారతి కర్కెరా; న్యూరో సైకాలజిస్ట్‌ భాగ్యశ్రీ మల్హొత్రా, సెక్రటరీ పంకజ్‌ ఖదీ ఉన్నారు.
 
హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించడం గురించి జస్లోక్‌ హాస్పిటల్‌ సీఈఓ జితేంద్ర హర్యన్‌ మాట్లాడుతూ, ముంబైకు ఆవల తమ సేవలను విస్తరించడం ఆనందంగా ఉందన్నారు. తమ హాస్పిటల్‌ ఏర్పాటుకు ఇక్కడి ప్రభుత్వం తగిన రీతిలో చేయూతనందించిందంటూ మరిన్ని రాష్ట్రాలలో తమ కార్యకలాపాల విస్తరించనున్నామన్నారు.
 
సియా లైఫ్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ స్వాతి ప్రత్తిపాటి మాట్లాడుతూ, తమ హైదరాబాద్‌ కార్యాలయం ద్వారా తెలంగాణావాసులకు జస్లోక్‌ హాస్పిటల్‌ సేవలనందించనున్నామన్నారు. భారతదేశవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధిగాంచిన జస్లోక్‌ హాస్పిటల్‌ ఏర్పాటు చేసే ఈ ఫంక్షనల్‌ న్యూరాలజీ క్లీనిక్‌ మెరుగైన సేవలను నగరవాసులకు అందించడంతో పాటుగా వారికి తగిన సౌకర్యమూ అందిస్తుందన్నారు.