శనివారం, 7 సెప్టెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 20 జులై 2024 (18:17 IST)

భారతదేశానికి విప్లవాత్మక క్యాన్సర్ చికిత్సను తీసుకువచ్చిన సన్ యాక్ట్

Mahima
భారతదేశంలో ఒక మైలురాయిగా చెప్పబడుతున్న అత్యాధునిక సాంకేతికత, వినూత్న క్యాన్సర్ చికిత్సను అందిస్తూ సన్ యాక్ట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ ఇప్పుడు భారతదేశంలో తమ కార్యకలాపాలు ప్రారంభించింది. అంతర్జాతీయంగా అయ్యే ఖర్చుతో పోలిస్తే నామమాత్రపు ఖర్చుతోనే చికిత్స అందించే  సన్ యాక్ట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ని శ్రీమతి మహిమా చౌదరి (నటి & క్యాన్సర్ విజేత) 2024 జూలై 20న థానే (ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం)లోని టైటెన్ మెడిసిటీ హాస్పిటల్ భవనంలోని 4వ అంతస్తులో ప్రారంభించారు. జీఎంపీ మాడ్యులర్ యూనిట్‌తో కూడిన భారతదేశపు మొట్టమొదటి సూపర్-స్పెషలైజ్డ్ క్యాన్సర్ క్లినిక్(ప్రసిద్ధ మెడికల్ ఆంకాలజిస్ట్- ప్రొఫెసర్ డా. విజయ్ పాటిల్, ఆంకాలజిస్ట్ డా. ఆశయ్ కర్పే నేతృత్వంలో దీనిని ఏర్పాటు చేసారు). 
 
డాక్టర్ విజయ్ పాటిల్ చెప్పినట్లుగా సన్ యాక్ట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ వినూత్న పరిశోధనలు, అత్యాధునిక సాంకేతికతలు, విప్లవాత్మక చికిత్సలు మరియు వ్యక్తిగతీకరించిన రోగుల సంరక్షణ ద్వారా భారతదేశంలో క్యాన్సర్ చికిత్సను అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉంది. థానేలోని ఈ క్లినిక్ ప్రస్తుతం దేశంలోనే మొట్టమొదటి సారిగా అలోజెనిక్ కార్-టి సెల్ థెరపీని అందిస్తోంది. దీనితోపాటు, సన్ యాక్ట్ కార్-టి (ఆటోలోగస్), స్టెమ్ సెల్/బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్, గామా డెల్టా టి-కణాలు, జన్యు చికిత్స(CRISPR మరియు జీన్ ఎడిటింగ్), ఇమ్యునోథెరపీ, అధునాతన/ఇంటెన్సివ్ కెమోథెరపీ, మొదలైనవి అందిస్తుంది. 
 
ఈ కేంద్ర ప్రారంభోత్సవ సందర్భంగా శ్రీమతి మహిమా చౌదరి మాట్లాడుతూ, “ఈ రోజు క్యాన్సర్ చికిత్సలో పురోగతిని చూడటం చాలా ఆశ్చర్యంగా ఉంది.  వైద్యులు మనకు అందించే నిస్వార్థ సేవకు సాటి ఏదీ లేదని నేను భావిస్తున్నాను. మనమందరం కలిసి క్యాన్సర్‌పై యుద్ధంలో విజయం సాధించగలం!” అని అన్నారు. ప్రముఖ మెడికల్ ఆంకాలజిస్ట్, ప్రొఫెసర్ & రచయిత, సన్ యాక్ట్ ఫౌండర్ డాక్టర్ విజయ్ పాటిల్ మాట్లాడుతూ, “ఈ వ్యాధిని భూమి  నుండి నిర్మూలించడమే లక్ష్యం. మేము భారతదేశంలో మొదటిసారిగా అలోజెనిక్ కార్-టి సెల్ థెరపీ విధానాన్ని విజయవంతంగా అందిస్తుండటం చాలా సంతోషంగా వుంది. పాశ్చాత్య దేశాలలో పోలిస్తే దాదాపు 1/8వ వంతు ధరతో మెరుగైన చికిత్స లభిస్తుంది. ఇది చాలామంది ప్రాణాలను కాపాడుతుంది” అని అన్నారు.