జలుబును అడ్డుకోవాలంటే.. టీ, నేరేడు పండ్లు, రెడ్ వైన్ తీసుకోండి..
జలుబును అడ్డుకోవడంలో బ్లాక్ టీ, రెడ్ వైన్, నేరేడు పండ్లు చక్కగా పనిచేస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. తేయాకు, రెడ్ వైన్, నేరేడు పండ్లలో అధికంగా వున్న ఫ్లేవనాయిడ్స్‌పై దృష్టి పెట్టి అమెరికాలోని వాషింగ్ట
జలుబును అడ్డుకోవడంలో బ్లాక్ టీ, రెడ్ వైన్, నేరేడు పండ్లు చక్కగా పనిచేస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. తేయాకు, రెడ్ వైన్, నేరేడు పండ్లలో అధికంగా వున్న ఫ్లేవనాయిడ్స్‌పై దృష్టి పెట్టి అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్శిటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఎలుక పిల్లలపై జరిపిన తాజా అధ్యయనంలో వీటిలో లభించే ఫ్లేవనాయిడ్స్ రోగ నిరోధక శక్తి మెరుగుకు తోడ్పడుతుందని తేలింది.
ఈ ఫ్లేవనాయిడ్స్ ఉదరంలోని బ్యాక్టీరియాను విచ్ఛిన్నం చేస్తాయి. అలాగే జలుబు లక్షణాలను చాలామటుకు తగ్గిస్తాయని పరిశోధకులు గుర్తించారు. జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు నేరేడు, టీ, రెడ్ వైన్ తీసుకుంటే తప్పకుండా ఉపశమనం లభిస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ఇంకా వీటిలోని ఫ్లేవనాయిడ్లు ఉదరంలోని బ్యాక్టీరియాతో కలిసినప్పుడు రోగ నిరోధక శక్తి పెరుగుతుందనే విషయాన్ని కూడా గుర్తించినట్లు వారు తెలిపారు.