శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 10 ఆగస్టు 2022 (18:25 IST)

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా విజయవాడ మణిపాల్‌ హాస్పిటల్స్‌ ప్రత్యేకంగా హార్ట్‌ కేర్‌ ప్యాకేజ్‌లు

Dr Muralikrishna
భారతదేశపు 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ను పురస్కరించుకుని మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడ ప్రత్యేకంగా ఫ్రీడమ్‌ హార్ట్‌ కేర్‌ ప్యాకేజ్‌ను ప్రారంభించింది. ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్‌ 02, 2022వ తేదీ వరకూ ఈ ప్యాకేజ్‌ అందుబాటులో ఉంటుంది. ఈ కార్యక్రమానికి సీనియర్‌ కన్సల్టెంట్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ ఎన్‌ మురళీకృష్ణ; ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ టీ మోనికా ఈ ఫ్లోరెన్స్‌; ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ ఎన్‌ సందీప్‌; కార్డియో థొరాకిక్‌ వాస్క్యులర్‌ సర్జన్‌ డాక్టర్‌ కోసూరు శ్రీనివాస్‌ బాబు, కార్డియాక్‌ అనస్థటిస్ట్‌ డాక్టర్‌ కె అనిల్‌కుమార్‌ నేతృత్వం వహించనున్నారు. ఫ్రీడమ్‌ ఆఫ్‌ హార్ట్‌ కేర్‌ ప్యాకేజ్‌లో భాగంగా రోగులు కంప్లీట్‌ బ్లడ్‌ కౌంట్‌ (సీబీసీ), రాండమ్‌ బ్లడ్‌ షుగర్‌ (ఆర్‌బీఎస్‌), టోటల్‌ కొలస్ట్రాల్‌, సీరమ్‌ క్రియాటిన్‌, ఈసీజీ, 2డీ ఎకో, యాంజియోగ్రామ్‌/సీటీ యాంజియోగ్రామ్‌ పరీక్షలను మరియు కార్డియాలజీ కన్సల్టేషన్‌ను రాయితీ ధరలలో పొందవచ్చు.

 
తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడాన్ని ప్రోత్సహించిన డాక్టర్లు, ప్రజలు ముందుకు వచ్చి పరీక్షలను చేయించుకోవడం ద్వారా తమ గుండెకు ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడాల్సిందిగా కోరారు. మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడలో ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ మురళీకృష్ణ నల్లమోతు మాట్లాడుతూ, ‘‘స్వాతంత్య్రదినోత్సవ సందర్భంగా, నగరం చుట్టు పక్కల ప్రాంతాలలోని ప్రజలకు అత్యుత్తమ హార్ట్‌ కేర్‌ను అందిస్తున్నాము. అందువల్ల వారు ముందుకు వచ్చి తమ గుండెను పరీక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాము. తద్వారా గుండె సమస్యల బారిన పడకుండా తగిన జాగ్రత్తలనూ తీసుకోవచ్చు’’ అని అన్నారు.

 
మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడ హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధాకర్‌ కంటిపూడి మాట్లాడుతూ, ‘‘నివారణ ఆరోగ్య సంరక్షణ ఆవశ్యకతను ప్రజలు గుర్తించాల్సిన సమయమిది. ఈ నివారణ ఆరోగ్యంలో  ఆరోగ్య పరీక్షలు, వ్యాక్సినేషన్‌లు, తగిన డైట్‌, వ్యాయామాలు వంటివి భాగంగా ఉంటాయి. అన్ని రకాల వ్యాధుల నుంచి ప్రజలను కాపాడటంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. తమకు తగిన నివారణ చర్యలను గురించి వారు డాక్టర్లను అడగాల్సి ఉంది.  అది దృష్టిలో పెట్టుకుని ఆర్యోవంతమైన జీవితానికి తోడ్పడే నివారణ ఆరోగ్య సంరక్షణ పరీక్షలను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం తీసుకువచ్చాము’’ అని అన్నారు.