గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: బుధవారం, 31 అక్టోబరు 2018 (15:02 IST)

ఆయన ఫోన్లో నా దుస్తులు లేని ఫోటో.... ఎందుకిలా చేశారు?

మా పెళ్లయి సంతోషంగా సంసారం చేసుకుంటున్నాము. ఇటీవల నా భర్త నిమగ్నమై ఉండగా బెడ్రూంలో ఆయన ఫోనును తీసి పరిశీలించాను. ఫోటో ఫైల్‌కి వెళ్లి చూస్తే బెడ్రూంలో దుస్తులు లేని నా ఫోటో కనబడింది. ఆ ఫోటోను చూసి షాక్ తిన్నాను. ఇంకా చూడబోతూ ఉంటే ఆయన వచ్చి ఫోనును లాక్కున్నారు. అందులో ఏముంది అని అంటే చెప్పడంలేదు. అలా దొంగచాటుగా దుస్తులు లేని నా ఫోటోను ఎందుకు తీశారు... దానిని ఎందుకు దాస్తున్నారు? ఆ ఫోటోతో ఆయన ఏమయినా చేస్తారేమోనని అనుమానంగా ఉంది... ఎందుకిలా చేశారు...?
 
కొంతమందికి ఇలా తమ భార్య శరీరాన్ని చూసుకోవాలని అనుకుంటుంటారు. అలాంటి వారు ఇలా ఫోటోలు తీసుకుని చూస్తుంటారు. ఈ విషయంలో మీరు అనుమానించాల్సినదేమీ లేదని గ్రహించండి. మీ సంసారం సంతోషంగా సాగుతూ ఉందని చెపుతున్నారు. ఆ ఫోటో మీరు చూసి ఉంటారని తెలిసిపోయింది కాబట్టి అందులో ఏముంది అని అడిగేకంటే అలా ఆ ఫోటో ఎందుకు తీసుకున్నావని అడగండి. ఖచ్చితంగా సమాధానమిస్తారు. 
 
ఇకపోతే... ఇలా దుస్తులు లేకుండా వున్న ఫోటో మీ చేతిలో పడింది కాబట్టి సరిపోయింది. గబుక్కున ఎవరైనా ఆయన ఫోనును చూస్తే పరిస్థితి మరోలా ఉంటుంది. కనుక ఆ ఫోటోను వెంటనే తొలగించమని చెప్పేయండి. ఫోటో ఉంచడం వల్ల కలిగే అనర్థాలను వివరించండి. అంతేతప్ప అనుమానాలకు పోయి సమస్యను పెద్దది చేసుకోవద్దు.