ఇష్టపడి పెళ్లాడితే వంటపని చేయిస్తోంది... పైకొచ్చి శృంగారం... ఎలా?

couple
Last Modified గురువారం, 14 మార్చి 2019 (21:03 IST)
పీజీ చదివే రోజుల్లో ఆమె అందానికి గులమైపోయాను. ఆమె అందమే కాదు, వినయ విధేయతలను చూసి ప్రేమలో పడిపోయాను. ఆమె మంచి ధనవంతురాలయినప్పటికీ కాలేజీలో నేనే టాప్ ర్యాంకర్‌ని. దాంతో ఆమెతో మాట్లాడటం సుళువుగానే జరిగిపోయింది. ఇద్దరం పరస్పరం ఇష్టపడుతున్నట్లు పెద్దలకు చెప్పాం. పెళ్లి చేసేశారు. 3 నెలలు హ్యాపీగానే గడిచింది. ఆ తర్వాత నుంచి సమస్య స్టార్ట్ అయింది. నేను మంచి కార్పొరేట్ కంపెనీలో ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్నాను. ఆ ఉద్యోగం మానేయమంది.

ఆ తర్వాత ప్రతి రాత్రీ ఆమె నాపైకి వచ్చి శృంగారం చేసిన తర్వాతే నేను చేయాలని కండిషన్ పెట్టింది. ఇంట్లో పనులు చూసుకుంటూ ఉండమని చెపుతోంది. బయటకు వెళ్లనీయడం లేదు. ఇంట్లో హోమ్ థియేటర్ ఏర్పాటు చేసి సినిమాలు చూసుకుంటూ ఎంజాయ్ చేయమంటోంది. ఏ నిర్ణయాన్ని నన్ను స్వతంత్రంగా తీసుకోనివ్వడంలేదు. ఆమె నాపై పూర్తిగా డామినేట్ చేస్తోంది. నాతో వంటపని కూడా చేయిస్తోంది.

ఐతే మా తల్లిదండ్రుల వద్ద మాత్రం ఎంతో వినయాన్ని నటిస్తుంది. అసలు సంగతి మా పేరెంట్స్‌కి చెపితే రివర్సులో కేసు పెడతానంటోంది. ఆమెతో కాపురం ఎలా చేయాలో తెలియడంలేదు.

కొంతమందిలో ఇలాంటి డామినేటింగ్ మెంటాలిటీ కనబడుతుంది. ఐతే అలాంటి మనస్తత్వం ఉన్నవారు ఏదో ఒక సంఘటన నేపధ్యంలో మారిపోవడం జరుగుతుంది. ప్రేమించి పెళ్లాడారు కనుక మీరు ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ కాదనలేరన్నది ఆమె భావనగా ఉండిఉంటుంది. ఇలాంటి సమస్యల పరిష్కారానికి కొద్దిగా ఓపిక అవసరమవుతుంది. పిల్లలు కలిగిన తర్వాత తప్పకుండా ఆమెలో మార్పు కనిపిస్తుంది. అంతవరకూ ఓర్పు పట్టక తప్పదు. ఒకవేళ ఆ తర్వాత కూడా ఇలాగే ప్రవర్తిస్తుంటే విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లండి. అప్పటికీ వినకపోతే మాత్రం మానసిక వైద్యులను సంప్రదించాల్సిందే.దీనిపై మరింత చదవండి :