సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : శుక్రవారం, 8 మార్చి 2019 (17:22 IST)

శృంగారం బోర్ కొడుతోంది... కొత్త విధానం కావాలని నా భర్తనడిగితే...

నా వయస్సు 38 యేళ్ళు. వివాహమై చాలా సంవత్సరాలైంది. వివాహమైనప్పటి నుంచి నాకు శృంగారమంటే ఇష్టం లేదు. నా భర్తతో పాల్గొన్నా ఎలాంటి ఫీలింగ్స్ కలగడం లేదు. ఏదో ఆయన అవసరానికి అనే విధంగా కలవడం చేస్తున్నా. పైగా ఆయన ఎప్పుడూ ఒకే పద్ధతి చేస్తూ వుండటంతో అదంటే బోర్ కొడుతోంది. అయితే, గత కొన్ని రోజులుగా నాకు కొత్త విధానంలో కావాలనిపిస్తుంది. ఆ విధంగా నేను ఎంజాయ్‌ చేయాలంటే ఏం చేయాలి. ఇపుడు ఉన్నట్టుండి కొత్త కోర్కెను చెబితే ఆయన తప్పుగా అర్థం చేసుకుంటారేమో? ఏం చేయాలి. 
 
శృంగారం పట్ల కొందరికి కొన్ని రకాల అభిప్రాయాలు ఉంటాయి. చాలామంది స్త్రీపురుషులు శృంగారాన్ని ఒక శారీరక అంశంగా మాత్రమే పరిగణిస్తారు. అందుకే మీరు అందులో అనుభూతిని పొందలేకపోతున్నారు. ఇప్పటికైనా నష్ట పోయిందేమి లేదు. ఎలా ఉండాలనుకుంటున్నారో ఆ విషయాన్ని నిర్భయంగా భర్తతో ఉండొచ్చు. 
 
ఇందుకు మానసికంగా కూడా  సిద్ధంకండి. అవసరమైతే శృంగారపరమైన పుస్తకాలు చదవడం, ఇంకా భర్త వద్ద అలాంటి సంభాషణ చేయడం ద్వారా మీరు కోరుకున్నది దక్కుతుంది. ప్రయత్నించి చూడండి.