సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2017 (13:23 IST)

అలోవెరా జ్యూస్‌ను డైట్‌లో చేర్చుకోండి.. స్లిమ్‌గా మారండి

అలోవెరా జ్యూస్‌ను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చునని.. శరీరాకృతిని మెరుగుపరుచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కలబంద జ్యూస్‌లో ఫైటోస్టెరోల్స్, విసిరల్ ఫ్యాట్స్ అధికంగా ఉన్నాయి. ఇవి శర

అలోవెరా జ్యూస్‌ను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చునని.. శరీరాకృతిని మెరుగుపరుచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కలబంద జ్యూస్‌లో ఫైటోస్టెరోల్స్, విసిరల్ ఫ్యాట్స్ అధికంగా ఉన్నాయి. ఇవి శరీరంలోపల అవయవాల చుట్టూ ఏర్పడే కొవ్వును కరిగిస్తాయి.

కలబంద రసంలో ఉండే ఫైటో స్టెరాల్స్ అంతర్గతంగా జీవక్రియ రేటును రెట్టింపు చేస్తాయి. ఫలితంగా శరీరంలో ఉండే అదనపు కొవ్వు పదార్థాలు ఈ జీవక్రియలో వినియోగించబడతాయి. ఫలితంగా శరీర బరువు తగ్గించబడుతుంది. 
 
అందాన్ని మెరుగుపరిచే గుణాలను కలిగి ఉండే కలబంద, శరీర బరువు తగ్గించటంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అల్లం మన శరీర బరువు తగ్గించే అద్భుతమైన ఔషదంగా చెప్పవచ్చు. ఈ రకం బరువు తగ్గించే రెసిపీ కోసంగానూ ఒక చెంచా కలబంద రసం, ఒక చెంచా అల్లం, ఒక కప్పు వేడి నీటిని తీసుకోవాలి. వీటిని తక్కువ మంట వద్ద కలిపి వేడి చేయాలి. ఇలా తయారు చేసిన మిశ్రమం అద్భుతంగా పని చేస్తుంది.
 
బరువు తగ్గించడంలో స్ట్రాబెర్రీ అద్భుతంగా పని చేస్తుంది. ఎందుకంటే వీటిలో ఉండే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. క్యాలరీలు తక్కువ, అందుకే బరువు తగ్గించే క్రమంలో దీన్ని ఉపయోగిస్తారు. క్యాలరీలు తక్కువగా ఉండటం ద్వారా బరువు తగ్గించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.