శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (21:13 IST)

రెండు చెంచాల వంటాముదాన్ని రోజూ రాత్రి పడుకునేముందు తాగితే?

ఆముదం చేసే మేలు తెలిస్తే దాన్ని ఉపయోగించకుండా వుండమని ఆరోగ్య నిపుణులు. చాలామంది ఆముదమంటే దూరం పెట్టేస్తుంటారు. కానీ ఆ ఆముదంతో వంటలు చేసుకున్నా.. దానితో చేసినవి తిన్నా ఎంతో మంచిదంటున్నారు. 
 
ఆముదం కడుపు నొప్పుల నివారణకు చక్కటి మార్గం. మలమూత్ర సమస్యలను సులువుగా పోగొడుతుంది. శరీరంలోని మలినాలన్నింటినీ బైటికి తోసేస్తుంది. నరాలకు బలాన్ని చేకూరుస్తుంది. తలనొప్పి, నడుము నొప్పిని నివారిస్తుంది. 
 
మలబద్దక నివారణకు వంటాముదం పెట్టింది పేరు. రెండు చెంచాల వంటాముదాన్ని రోజూ రాత్రి పడుకునేముందు తాగితే మలబద్దక సమస్య తీరడమే కాకుండా మూత్రపిండాలు బాగుపడతాయట. మూత్రకోశంలోని రాళ్ళు కరిగిపోతాయి. కొబ్బరినూనె, ఆముదం కలిపి అరికాళ్ళకు మర్దనా చేస్తే అరికాళ్ళ మంటలు నెమ్మదిస్తాయి. 
 
వంటాముదం, పసుపు, కుంకుమ కలిపి నాలుకకు రాస్తే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. ఆముదం నూనెతో చేమదుంపలకు తాలింపు పెట్టిన కూరను తింటుంటే మొండి దగ్గు మటుమాయమవుతుంది. పొత్తికడుపుపై ఆముదపు ఆకులు వేడి చేసి కడుపుపై కడితే జిగట విరేచనాలు తగ్గిపోతాయి.
 
దురద, వాపు సమస్యలను ఆముదము నివారిస్తుంది. వాత దోషంతో వచ్చే తలనొప్పికి ఆముదం తలకు రాసి మర్థిస్తే శిరోవేదనను హరిస్తుంది. ఆముదం తలకు రాసుకుంటే కురులు వత్తుగా పెరుగుతాయి. వేసవిలో ఆముదాన్ని తలకి నూనెగా రాసుకుంటే తలభారం ఎండవేడి ఉండదు.