భోజనం తర్వాత ఆపిల్ తింటే.. ఉడకబెట్టిన బంగాళాదుంపతో..?
మామిడి పండు, పుచ్చకాయలలో విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి ఎసిడిటీ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఎసిడిటీ స్థాయిని తగ్గించడంలో ఆపిల్ కీలక పాత్ర పోషిస్తుంది. భోజనం తర్వాత ఒక ఆపిల్ తింటే ఎసిడిటీ రాకుండ
మామిడి పండు, పుచ్చకాయలలో విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి ఎసిడిటీ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఎసిడిటీ స్థాయిని తగ్గించడంలో ఆపిల్ కీలక పాత్ర పోషిస్తుంది. భోజనం తర్వాత ఒక ఆపిల్ తింటే ఎసిడిటీ రాకుండా నివారిస్తుంది. బంగాళదుంపలో పొటాషియం అధికంగా ఉండడం వల్ల ఇది ఎసిడిటీని నియంత్రిస్తుంది. ఉడకబెట్టిన బంగాళదుంప మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇకపోతే.. ఉల్లికాడలు ఎసిడిటీని తగ్గిస్తాయి. ఇందులో ఉన్న పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఎసిడిటీని తగ్గించేందుకు దోహదం చేస్తాయి. ఆకు కూరలలో ఉండే ఎంజైములు, క్లోరోఫిల్ కడుపులోని ఎసిడిటీని నియంత్రిస్తాయి. గుండెలో మంటగా ఉన్నప్పుడు తాజా నిమ్మ, ఆరెంజ్, నారింజ, పైనాపిల్, క్యారెట్, గుమ్మడి, దోస, సొర కాయరసాలు తాగితే ఎసిడీటీ లేదా గుండెల్లో వచ్చే మంట తగ్గుతుంది.
భోజనం చేసే అరగంట, 40 నిమిషాల ముందు గోరు వెచ్చటి నీళ్ళల్లో నిమ్మరసం పిండి తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ సరిగా జరగడమే కాక నిమ్మలో ఉండే పొటాషియం ఆమ్లాలను సమతులం చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.