బరువు తగ్గాలా? బార్లీ నీళ్లు తాగండి.
బరువు తగ్గాలనుకునేవారు కూడా ప్రతిరోజూ బార్లీ నీళ్లు తాగడం అలవాటు చేసుకోవడం మంచిది. ఎందుకంటే..? బార్లీలో పీచు, బీటా గ్లూకాన్లు అధికం. ఇవి శరీరానికి మేలు చేయడమే కాదు.. జీవక్రియ రేటు కూడా మెరుగుపరుస్తాయి
బరువు తగ్గాలనుకునేవారు కూడా ప్రతిరోజూ బార్లీ నీళ్లు తాగడం అలవాటు చేసుకోవడం మంచిది. ఎందుకంటే..? బార్లీలో పీచు, బీటా గ్లూకాన్లు అధికం. ఇవి శరీరానికి మేలు చేయడమే కాదు.. జీవక్రియ రేటు కూడా మెరుగుపరుస్తాయి. తద్వారా బరువు అదుపులోకి వస్తుంది. డీహైడ్రేషన్ సమస్యతో బాధపడేవారికి బార్లీ నీరు దివ్యౌషధంగా పనిచేస్తుంది.
రక్తంలో కొలెస్ట్రాల్ శాతం తగ్గించడంలోనూ బార్లీ నీళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. హృద్రోగ సమస్యలూ దరి చేరకుండా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ బి రక్తపోటు సమస్యను దూరం చేస్తుంది. అజీర్తికి బార్లీ నీళ్లు చెక్ పెడతాయి. మధుమేహం ఉన్నవారూ బార్లీ నీళ్లకు ప్రాధాన్యమిస్తే మేలు.
ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెరస్థాయుల్లో హెచ్చుతగ్గులుండవు. ఇన్సులిన్ కూడా అదుపు తప్పదు. దీనిలో ఉండే గ్లైసమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. ఫలితంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్య కూడా దరిచేరదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.