శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 15 ఫిబ్రవరి 2020 (22:27 IST)

ఈ నాలుగు తింటే ఆరోగ్యానికి మేలు

క్యాలీఫ్లవర్ : క్యాలీఫ్లవరీలో ఫైబర్, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది కేవలం బరువును నియంత్రించడమే కాకుండా హృద్రోగాల బారిన పడకుండా రక్షిస్తుంది. 
 
బ్లూ బెర్రీస్ : ఈ బ్లూ బెర్రీస్ పండ్లలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. ఇది రక్తప్రసరణ మరింత సులభతరంగా జరిగేందుకు దోపదపడుతుంది. ఇందులో ఉండే వివిధ రకాలైన ఖనిజాలు వృద్ధాప్య సమస్య నుంచి రక్షిస్తాయి. పొటాషియం అత్యధికంగా ఉంటుందని వైద్యులు చెపుతున్నారు. 
 
అక్రోట్ : ఇది ఒక పండుగా మాత్రమే కాకుండా, ఇందులో అత్యధికంగా ఇ విటమిన్ ఉంటుంది. ఇందులో ఉండే ఆమ్లాలు చర్మాన్ని రక్షిస్తుంది. అలాగే, చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తూ.. చర్మాన్ని మరింత తాజాదనంగా ఉంచుతుంది. 
 
డార్క్ చాక్లెట్ : ప్రతి ఒక్క చాక్‌లెట్‌లో ప్రొటీన్స్, విటమిన్స్‌ బి తో కూడిన కోకో కనీసం 70 శాతం వరకు ఉంటుంది. ఈ చాక్లెట్‌ను రెగ్యులర్‌గా ఆరగిస్తున్నట్టయితే, ఇది కొవ్వును తగ్గించి, చర్మ, కేశ సౌందర్యాన్ని మెరుగు పరుస్తుంది.