గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (19:10 IST)

ఏ రసం ఎందుకు?

పండ్ల రసాలు చేసే మేలు అలా వుంచితే కూరగాయల రసాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
 
క్యారెట్ రసం: క్యారెట్ రసంలో వుండే కెరోటిన్ కాలేయానికి మేలు చేస్తుంది. బరువు తగ్గేందుకు, కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది. ఉదర సంబంధ వ్యాధులతో పాటు క్యాన్సర్లను కూడా నిరోధించే శక్తి దీనికి వుంది.
 
తోటకూర రసం: ప్రతి రోజూ భోజనం చేసే ముందు రోజుకి రెండుసార్లు చొప్పున తోటకూర రసం తీసుకుంటే రక్తంలోని షుగర్ స్థాయిలు తగ్గుతాయి.
 
టమోటో రసం: గుండె సంబంధ జబ్బులు రాకుండా చూసే గుణం ఈ రసంలో వుంది. 
 
కీరా రసం: జాయింట్ల రుగ్మతలను పోగొడుతుంది. దీనిలో వుండే అత్యున్నత స్థాయి పొటాషియం కిడ్నీలను శుభ్రపరుస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. ఇది అన్ని రకాల చర్మ సమస్యలను నివారించే మంచి ఔషధంలా పనిచేస్తుంది.