ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 25 ఆగస్టు 2023 (21:03 IST)

కొబ్బరి కల్లు తాగితే ఏమవుతుంది?

Coconut delight
కొబ్బరి. మూత్రకోశ వ్యాధులకు కొబ్బరి బాగా పనిచేస్తుంది. హృదయ వ్యాధులు కలిగినవారికి ఎంతో మేలు చేస్తుంది. బలాన్ని కలిగిస్తుంది. చలువ చేస్తుంది. వేడినీ, వాతాన్ని తగ్గిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం కొబ్బరితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. గర్భిణీ స్త్రీలు వారానికి రెండుమూడు రోజులు 3 ఔన్సుల కొబ్బరి కల్లు త్రాగితే పుట్టబోయే పిల్లలు ఎర్రగా, తెల్లగా పుడతారని చెపుతారు.
 
మూత్రాశయంలో వాతపు నొప్పిని తగ్గించే శక్తి ఈ కొబ్బరి కల్లుకు వుంది. లేత కొబ్బరి కాయలోని నీరు వాంతిని పోగొట్టి పైత్యమును తగ్గిస్తుంది. లేత కొబ్బరి, అరటిపండు, పాలు కలిపి చిన్నపిల్లలకు తినిపిస్తే బలమైన ఆహారంగా పనిచేస్తుంది. కొబ్బరిపాలు, బొప్పాయి పాలు, కొంచెం తేనె కలిపి రాత్రిళ్లు ఒక స్పూను మోతాదు సేవిస్తే దగ్గు, విరేచనాలు తగ్గుతాయి.
 
ఎండు కొబ్బరిలో కొంచెం పంచదార కలిపి తింటుంటే ప్రేగులలోనున్న కురుపులు మానిపోతాయి. కొబ్బరి నీరు ఆకలిని పుట్టించి చలువ చేస్తుంది. మేహశాంతిని కలిగిస్తుంది. మీగడలాంటి లేత కొబ్బరిని ముఖంపైన వేసి రుద్దుతుంటే మొటిమలు తగ్గి ముఖం నునుపుదేలుతుంది.