శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : సోమవారం, 27 మార్చి 2017 (12:11 IST)

వంటల్లో కొబ్బరినూనెను వాడితే...

ప్రస్తుతం వంటల్లో వాడేందుకు వివిధ రకాల నూనెలు మార్కెట్‌ అందుబాటులో ఉన్నాయి. కానీ ఎక్కువగా సన్‌ఫ్లవర్ ఆయిల్‌నే వాడుతుంటారు. అయితే, కొబ్బరినూనె వాడకం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకుల

ప్రస్తుతం వంటల్లో వాడేందుకు వివిధ రకాల నూనెలు మార్కెట్‌ అందుబాటులో ఉన్నాయి. కానీ ఎక్కువగా సన్‌ఫ్లవర్ ఆయిల్‌నే వాడుతుంటారు. అయితే, కొబ్బరినూనె వాడకం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు చెపుతున్నారు.
 
వివిధ రాష్ట్రాల్లో పలు రకాల నూనెలను ఉపయోగిస్తుంటారు. కానీ, దణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా కేరళ వంటి రాష్ట్రంలో అయితే కొబ్బరినూనెను విరివిగా వాడుతుంటారు. అక్కడి ప్రజలు దీనిని ఎక్కువగా వినియోగించడానికి కారణం.. దానివల్ల చేకూరే ప్రయోజనాలేనని పరిశోధకులు చెబుతున్నారు. 
 
కూరలు లేదా వంటల్లో కొబ్బరినూనెను వాడటం వల్లే శరీరంలోని కొవ్వును ఇట్టే కరిగిస్తుందట. అలాగే, ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్‌ఫెక్షన్ల నుంచి చర్మాన్ని సంరక్షిస్తుంది. గుండె పనితీరు మెరుగు పరుస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ప్రధానంగా బరువును తగ్గించేందుకు తోడ్పడుతుందని వైద్యులు చెపుతున్నారు.