బుధవారం, 4 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : సోమవారం, 13 మార్చి 2017 (14:16 IST)

ఆరోగ్యానికి.. అందానికి మేలు చేసే పెరుగు.. ఎముకలు బలపడాలా?

పిల్లలకు పెరుగు రోజూ వారీ ఆహారంలో చేర్చాలి. అలాగే పెద్దలు కూడా రోజూ రెండు కప్పుల పెరుగును ఆహారంలో చేర్చుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. ఇందులోని విటమిన్ బి 12 శరీరంలో ఎర్రరక్తణాల సంఖ్యను పెంచుతుంది.

పిల్లలకు పెరుగు రోజూ వారీ ఆహారంలో చేర్చాలి. అలాగే పెద్దలు కూడా రోజూ రెండు కప్పుల పెరుగును ఆహారంలో చేర్చుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. ఇందులోని విటమిన్ బి 12 శరీరంలో ఎర్రరక్తణాల సంఖ్యను పెంచుతుంది. ఇంకా నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే వీటిలోని ప్రో బయోటిక్స్ శరీరంలోని తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచుతాయి. ఇందులో లభించే కాల్షియం కారణంగా ఎముకలు ధృడంగా ఉండేందుకు దోహదపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
పెరుగులోని ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు కొవ్వు పదార్థాలను శక్తి రూపంలోకి మార్చడానికి ఉపయోగపడతాయి. అల్సర్‌తో బాధపడేవారు పెరుగు తీసుకుంటే ఉపశమనం కలుగుతుందని వైద్యులు చెప్తున్నారు. చర్మం నిగనిగలాడుతూ కనిపించేలా కూడా పెరుగు ఉపయోగపడుతుంది. రోజూ పెరుగును తీసుకుంటే.. ఎండ వేడికి చర్మం పాడవకుండా చేస్తుంది. చర్మానికి సరఫరా అయ్యే నరాలకి శక్తినిస్తుంది. పెరుగులో ఉండే బాక్టీరియా చర్మ పోషణకు ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.