శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శనివారం, 23 జూన్ 2018 (19:23 IST)

గోంగూర పచ్చడిలో ఏమున్నదంటే?

ఆంధ్రుల అభిమాన పచ్చడి గోంగూర. గోంగూర అంటే ఇష్టపడే వారు ఎందరో.... గోంగూరతో చట్నీనే కాదు ఇతర వంటకాలు వండొచ్చు. దీనిని ఆంధ్రదేశమున విరివిగా వాడతారు. అందుకే గోంగూరను ఆంధ్రమాత అని అంటారు. ఇందులో క్యాల్షియం, ఇనుము, విటమిన్ ఎ,సి, రైబోఫ్లెవిన్, ఫోలిక్ యాసిడ్

ఆంధ్రుల అభిమాన పచ్చడి గోంగూర. గోంగూర అంటే ఇష్టపడే వారు ఎందరో.... గోంగూరతో చట్నీనే కాదు ఇతర వంటకాలు వండొచ్చు. దీనిని ఆంధ్రదేశమున విరివిగా వాడతారు. అందుకే గోంగూరను ఆంధ్రమాత అని అంటారు. ఇందులో క్యాల్షియం, ఇనుము, విటమిన్ ఎ,సి, రైబోఫ్లెవిన్, ఫోలిక్ యాసిడ్ మరియు పీచు ఎక్కువుగా ఉంటుంది. ఇందులో ఐరన్ ఎక్కువుగా ఉండటం వలన కొంచెం ఎక్కువ తింటే  అరగదు. దీని ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం.
 
1. ఆహార పదార్థంగా గోంగూర ఉపయోగం మనకు తెలుసు. సంవత్సరం పొడవునా నిల్వ ఉండి, ఉప్పులో ఊర వేసిన గోంగూర అత్యవసర పరిస్థితులలో సిద్ధంగా ఉండే కూర.
 
2. రేచీకటి, రాత్రిపూట సరిగా చూపుకనపడక పోవడం అనే నేత్ర రోగం లేదా దృష్టి దోషంతో బాధపడేవారు భోజనంలో ఆకుకూర గానో, పచ్చడిగానో, ఊరగాయగానో గోంగూర వాడితే కొంతమేరకు మంచి ఫలితం ఉంటుంది. అయితే తరచూ గోంగూర వాడుతూ గోంగూర పువ్వులను దంచి అరకప్పు రసం తీసి దానికి అరకప్పు పాలు కలిపి తాగితే రేచీకటి తగ్గుతుంది.
 
3. శరీరంలో వాపులు తీయడానికి గోంగూర, వేపాకు కలిపి నూరి వాడితే మంచి ఫలితం ఉంటుంది.
 
4. దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధ పడేవారు గోంగూరను ఏదోవిధంగా తింటే మంచి స్వస్థత చేకూరుతుంది.
 
5. శరీరంలో నీరు చేరినప్పుడు ఈ ఆకు కూర పథ్యం చాలా మంచిది. అంతేకాకుండా ఇది మలబద్దకాన్ని, రేచీకటిని తొలగిస్తుంది.
 
6. విరోచనాలు అధికంగా అయ్యేటప్పుడు కొండ గోంగూర నుంచి తీసిన జిగురును నీటితో కలిపి త్రాగితే మంచి ఉపశమనం లభిస్తుంది.