శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 13 జూన్ 2017 (15:18 IST)

కాలేయాన్ని రక్షించి.. కీళ్ళనొప్పులను దూరం చేసే గ్రీన్ యాపిల్..

కీళ్ళనొప్పుల నుంచి ఉపశమనం లభించాలంటే రోజూ గ్రీన్ యాపిల్ తీసుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గ్రీన్ యాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ కాలేయాన్ని రక్షిస్తాయి. కీళ్ల నొప్పులు రాకుండా అడ్డుకుంటుంది. శర

కీళ్ళనొప్పుల నుంచి ఉపశమనం లభించాలంటే రోజూ గ్రీన్ యాపిల్ తీసుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గ్రీన్ యాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ కాలేయాన్ని రక్షిస్తాయి. కీళ్ల నొప్పులు రాకుండా అడ్డుకుంటుంది. శరీరంలోని థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేసేల ఈ పండు చేస్తుంది. వయసు పైబడినవారిలో నాడీ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. చేతులు వణుకుతుంటే రోజూ గ్రీన్ యాపిల్ తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
గ్రీన్ యాపిల్ రసం తీసుకుంటే ఆస్తమా తగ్గుతుంది. మధుమేహ వ్యాధి రాకుండా నిరోధించే శక్తి దీనికి ఉంది. చర్మ సంబంధ ఇబ్బందులన్నిటికీ తగిన ఔషధం యాపిల్ పండు. దీనిలోని పీచుపదార్థం, లవణాలు, విటమిన్లు ప్రత్యక్షంగా కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. యాపిల్ గుజ్జును ముఖానికి రాసుకుంటే చర్మ సమస్యలు దూరమవుతాయి. ఇంకా రోజూ గ్రీన్ యాపిల్ తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.