గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సందీప్ కుమార్
Last Updated : శుక్రవారం, 30 ఆగస్టు 2019 (18:36 IST)

రోజూ గ్లాస్ లెమన్ జ్యూస్‌లో కొద్దిగా తేనె, ఉప్పు కలుపుకుని?

సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, పని ఒత్తిడి తదితర కారణాల వల్ల చాలా మంది నీరసంగా, నిస్సత్తువగా కనిపిస్తుంటారు. అలసటకు కూడా గురౌతుంటారు. రోజంతా ఇలా ఉండటం చిరాకును కూడా కలిగిస్తుంది. ఫిట్‌గా యాక్టివ్‌గా ఉండేందుకు ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. 
 
రోజూ వ్యాయామం చేయడం మంచి అలవాటు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే యాక్టివ్‌గా, ఫిట్‌గా ఉండటమే కాక అనారోగ్యాలు కూడా దరిచేరవని చెబుతున్నారు నిపుణులు. ఆహార పదార్థాల విషయానికి వస్తే క్రొవ్వు అధికంగా ఉండే పదార్థాలు తినకూడదు. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటే అలసట తొలగిపోతుంది. 
 
రోజూ గ్లాస్ లెమన్ జ్యూస్‌లో కొద్దిగా తేనె, ఉప్పు కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. నిద్రలేమి వలన నీరసంగా, అలసటగా ఉంటారు. నిద్ర మనకు చాలా ముఖ్యం కనుక రాత్రివేళలో పాలలో కొద్దిగా మిరియాల పొడి, తేనె, చక్కెర కలిపి సేవిస్తే చక్కగా నిద్రపడుతుంది. 
 
శరీరంలో రక్తం తక్కువగా ఉండటం వలన కూడా నీరసంగా ఉంటుంది. అలాంటప్పుడు ప్రతిరోజూ పాలలో ఖర్జూరాన్ని నానబెట్టి తీసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వలన రక్తసరఫరా మెరుగుపడుతుంది.