శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సందీప్
Last Updated : గురువారం, 29 ఆగస్టు 2019 (12:37 IST)

బాన పొట్ట తగ్గిపోవాలంటే ఇలా చేయండి...

మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిది, దీనిని వంటలలో ఉపయోగిస్తారు, కానీ ఇది పలు రకాల వ్యాధులకు మందులా పనిచేస్తుంది. మనకు కడుపునొప్పి వచ్చినా, వేడి చేసినా మెంతులు తీసుకోవడం సాధారణం. కొంత మంది మెంతులను నానబెట్టి మెత్తగా రుబ్బి తలపై వేసుకుంటారు. 
 
మెంతి పొడిని ఊరగాయల్లోనూ వాడతారు. ఇలా మెంతుల వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. మెంతులలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. దానితో పాటు విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం ఉంటాయి. దీనిలో క్యాలరీలు కూడా తక్కువే కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు వీటిని తీసుకోవచ్చు. 
 
ఈ గింజలలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి, గింజల్లోని జిగురు, చెడు రుచికి కారణం అదే. జీర్ణాశయం సంబంధ సమస్యలకు మెంతులు మంచి ఔషధం. స్థూలకాయం, చెడు కొలెస్ట్రాల్‌, మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి. 
 
ఇది మూత్ర వ్యవస్థను పరిపుష్టం చేస్తుంది. క్లోమ గ్రంథిని పోషించే కొవ్వు మేటలను ఇది శుభ్రం చేస్తుంది. మజ్జిగలో ఒక స్పూన్ మెంతులు రాత్రంతా నానబెట్టి పరగడుపున తాగితే ఒంట్లో ఉన్న మొత్తం కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గుతుంది. ఎలాంటి పొట్ట అయినా ఇట్టే కరిగిపోతుంది.