గురువారం, 5 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chitra
Last Updated : శనివారం, 9 జులై 2016 (16:52 IST)

జుట్టు రాలుతుందా? మెంతులు, పుల్లటి పెరుగు ప్యాక్‌ వేసుకోండి..!

మనలో ప్రతియొక్కరు ఎదుర్కొనే సమస్య జుట్టు రాలడం. ఇరవై ముప్పై ఏండ్లు వచ్చే సరికి తల వెంట్రుకలు సగం రాలిపోయి అరగుండు అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి. వీటికోసం ఆ ప్యాక్‌లు, ఈ ప్యాక్

మనలో ప్రతియొక్కరు ఎదుర్కొనే సమస్య జుట్టు రాలడం. ఇరవై ముప్పై ఏండ్లు వచ్చే సరికి తల వెంట్రుకలు సగం రాలిపోయి అరగుండు అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి. వీటికోసం ఆ ప్యాక్‌లు, ఈ ప్యాక్‌లంటూ డబ్బులు తగలేయనక్కర్లేదు. ఇంట్లో దొరికే ఆహారపదార్థాలతోనే ఈ సమస్యను అరికట్టవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...
 
మన వంటింట్లో లభించే "మెంతులు" వెంట్రుకలు రాలిపోకుండా కాపాడుతుంది. తల వెంట్రుకలు రాలడం, తలపొడి బారడం, చుండ్రు వంటి సమస్యలను తీర్చడానికి పావు కప్పు మెంతులను రాత్రి పుల్లటి పెరుగులో నానబెట్టి ఉదయాన్నే దానిని మిక్సీలో రుబ్బి తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వేపాకును మెత్తగా నూరి తలకు పట్టించినా లేదా వేప నూనెను వాడినా కూడా జుట్టు సమస్య ఉండదు.
 
తాజా పండ్లు, కూరగాయలు ముఖ్యంగా జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ బి కాల్షియం, జింక్ విటమిన్లు ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా మనం డైలీ తినే కూరలలో ఉపయోగించే కరివేపాకు కూడా ఎక్కువ మోతాదులో తింటే జుట్టు రాలకుండా ఉంటుంది. రాత్రి పడుకునే సమయంలో కొబ్బరి నూనెతో మసాజ్‌ చేస్తే వెంట్రుకల మొదల్లలో కదలికలు జరిగి, కేశాలు ఊడిపోకుండా ఆరోగ్యంగా ఉంటాయి.