శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 24 జనవరి 2017 (13:31 IST)

చెమట దుర్వాసనకు చెక్ పెట్టాలంటే.. అల్లం.. కొత్తిమీర..?

చెమట దుర్వాసనను దూరం చేసుకోవాలంటే.. అల్లం దివ్యౌషధంగా పనిచేస్తుంది. అల్లంలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది శరీర ఆరోగ్యానికి వివిధ రకాలుగా సహాయ పడుతుంది. టాక్సిన్స్ తొలగించడం వల్ల దుర్వాస

చెమట దుర్వాసనను దూరం చేసుకోవాలంటే.. అల్లం దివ్యౌషధంగా పనిచేస్తుంది. అల్లంలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది శరీర ఆరోగ్యానికి వివిధ రకాలుగా సహాయ పడుతుంది. టాక్సిన్స్ తొలగించడం వల్ల దుర్వాసనను దూరం చేస్తుంది. అలాగే ఆరెంజ్ పండులో సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేస్తుంది. బాడీ మంచి వాసనతో ఉంటుంది. కొత్తమీరలో ఎంజైమ్స్ శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపించి చెమట నుండి విముక్తి కల్పిస్తుంది
 
ఆరెంజ్ లాగే నిమ్మరసంలో కూడా విటమిన్ సి కంటెంట్ అధికంగానే ఉంటుంది. ఇది శరీరంలో ఎలాంటి దుర్వాసనైనా నివారిస్తుంది. పండ్లలో ఆపిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే టాక్సిన్ తొలగించడంలోనూ ఇది ఎంతో మేలు చేస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. రోజుకు ఒక్క యాపిల్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు టాక్సిన్స్ బయటకు పంపుతాయి. దీనితో చెమట వాసన దూరమౌతుంది.