1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 9 ఆగస్టు 2016 (17:50 IST)

తేనె.. అసలుదా.. నకిలీదా.. తెలుసుకునేదెలా? (వీడియో)

తేనె అంటే ఇష్టపడని వారుండరు. చిన్నపిల్లల వద్ద నుంచి పెద్దలవరకు అమితంగా ఇష్టపడుతుంటారు. కేవలం సాధారణంగా ఆరగించడమే కాకుండా, ఓ దివ్యౌషధంగా కూడా వినియోగిస్తుంటారు. అయితే, అలాంటి తేనెలో ఇపుడు కల్తీ ఎక్కువై

తేనె అంటే ఇష్టపడని వారుండరు. చిన్నపిల్లల వద్ద నుంచి పెద్దలవరకు అమితంగా ఇష్టపడుతుంటారు. కేవలం సాధారణంగా ఆరగించడమే కాకుండా, ఓ దివ్యౌషధంగా కూడా వినియోగిస్తుంటారు. అయితే, అలాంటి తేనెలో ఇపుడు కల్తీ ఎక్కువైపోయింది. స్వచ్ఛమైన తేనె లభించడం చాలా అరుదుగా మారింది. ముఖ్యంగా.. మార్కెట్‌లో లభించే తేనెలో అధికంగా కల్తీలు జరుగుతున్నాయి. అలాంటపుడు మార్గెట్‌లో మనం కొనుగోలు చేసే తేనె అసలుదా లేదా నకిలీదా అనేది ఎలా తెలుసుకోవాలో ఓ సారి పరిశీలిద్ధాం. 
 
తేనెను కొనుగోలు చేశాక.. ఓ బొట్టు గోరుపై వేసుకోండి. ఆ చుక్క గోరుపై అటు ఇటు క‌దిలితే అది న‌కిలీ తేనె అని గుర్తించండి. అలా కాకుండా, స్థిరంగా గోరుపై ఉంటే మాత్రం ఖచ్చితంగా అది అసలైందిగా భావించొచ్చు. 
 
అలాగే, ఒక టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేయాలి. న‌కిలీ తేనె అయితే వెంట‌నే నీటిలో క‌రుగుతుంది. అస‌లు తేనె గ్లాస్ అడుగు భాగంలోకి చేరుతుంది. అంతే త‌ప్ప నీటిలో అంత త్వ‌ర‌గా క‌ర‌గ‌దు.
 
చివరగా, తేనెకు మండే గుణం ఉంది. అందువల్ల ఒక కాట‌న్ బంతిని తీసుకుని దాన్ని తేనెలో పూర్తిగా ముంచాలి. ఆ తర్వాత దాన్ని వెలికి తీసి అగ్గిపుల్ల వెలిగించి నిప్పు పెట్టండి. ఒరిజినల్ తేనె అయితే కాట‌న్ బంతి మండిపోతుంది. న‌కిలీ తేనె అయితే కాటన్ బాల్‌కు నిప్పు అంటుకోదు.