శనివారం, 26 ఏప్రియల్ 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chitra
Last Updated : శనివారం, 16 జులై 2016 (13:15 IST)

స్నానం చేసేటప్పుడు చర్మాన్ని అదేపనిగా రుద్దుతున్నారా?

సంవత్సరంలో వచ్చే అన్ని సీజన్లలో కంటే వింటర్ సీజన్లో చర్మం చాలా దెబ్బతింటుంది. చర్మం పొడిబారడం, ముడతలు ఏర్పడటం జరుగుతుంది. గాలిలో తేమలేకపోవడం వల్ల, వాతావరణ పరిస్థితుల వల్ల ముఖంలో నీటి శాతం పూర్తిగా తగ్గిపోతుంది. దాంతో చర్మం చాలా డల్‌గా మారిపోతుంది. ఈ

సంవత్సరంలో వచ్చే అన్ని సీజన్లలో కంటే వింటర్ సీజన్లో చర్మం చాలా దెబ్బతింటుంది. చర్మం పొడిబారడం, ముడతలు ఏర్పడటం జరుగుతుంది. గాలిలో తేమలేకపోవడం వల్ల, వాతావరణ పరిస్థితుల వల్ల ముఖంలో నీటి శాతం పూర్తిగా తగ్గిపోతుంది. దాంతో చర్మం చాలా డల్‌గా మారిపోతుంది. ఈ కాలంలో స్నానం తరువాత చర్మం పొడిగా మారి, దురదలు వంటి సమస్యలతో వేధిస్తుంది. స్నానం తరువాత కలిగే ఈ సమస్యలను కొన్ని పద్దతులను అనుసరిస్తే క్రమంగా తగ్గించవచ్చు.
 
వాతావరణ ఉష్ణోగ్రతలు ఎంత చల్లగా ఉన్నకూడా వేడినీటిలో స్నానం చేయడం కూడదు. వేడి నీటికి బదులుగా, గోరు వెచ్చగా ఉన్న నీటితో స్నానం చేయటం మంచిది. వేడి నీటి వలన, చర్మంపై ఉండే తేమను, నూనెను పూర్తిగా తొలగిస్తుంది.
 
స్నానం చేసే సమయంలో చర్మాన్ని విపరీతంగా రుద్దకూడదు. స్నానం చేసేటప్పుడు చాలామంది చర్మాన్ని అదేపనిగా రుద్దుతారు. ఇది చర్మానికి హానికరం.
చర్మం ఆరోగ్యంగా ఉండటానికి ముఖ్యమైనది తేమ. స్నానం తరువాత చర్మానికి తేమను అందించే క్రీమ్‌లను వాడాలి. మార్కెట్‌లో కొత్త కొత్తవి వచ్చాయి కదాని అదేపనిగా వాడకూడదు. చర్మానికి సరిపోయేవి ఎంచుకుని వాడాలి.