ఆదివారం, 27 ఏప్రియల్ 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 3 మార్చి 2017 (22:49 IST)

సపోటా పండులో ఏముంది..? తింటే ఏం జరుగుతుంది?

సపోటా పండు శరీర ఉష్ణోగ్రత అధికంగా పెరగకుండా నియంత్రిస్తుంది. నీరసం తొలగి పనిచేయడానికి అవసరమయ్యే శక్తి సమకూరుస్తుంది. సపోటాలో పుష్కలంగా లభించే కరోటిన్ కంటి ఆరోగ్యానికి దోహదపడుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. ఈ పండ

సపోటా పండు శరీర ఉష్ణోగ్రత అధికంగా పెరగకుండా నియంత్రిస్తుంది. నీరసం తొలగి పనిచేయడానికి అవసరమయ్యే శక్తి సమకూరుస్తుంది. సపోటాలో పుష్కలంగా లభించే కరోటిన్ కంటి ఆరోగ్యానికి దోహదపడుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. ఈ పండులో గ్లూకోజ్, విటమిన్ సి, క్యాల్షియం సమృద్ధిగా లభిస్తాయి. 
 
సపోటా తేలికగా జీర్ణమవుతుంది. అందువల్ల చిన్నపిల్లలకూ, వృద్ధులకూ కూడా ఇవ్వవచ్చు. ఇంకా ఇందులో సోడియం, పొటాషియం, మెగ్నీషియం లభిస్తాయి. రాగి కూడా స్వల్పశాతంలో ఉంటుంది. గంధకం, క్లోరీన్, కూడా లభిస్తాయి. కొవ్వు పదార్థం, పిండిపదార్థం, నీరు పీచు పదార్థం కూడా ఈ పండులో వుంటాయి. పోషక విలువలున్న ఈ పండును తీసుకోవడం వల్ల ఆరోగ్యం పెంపొందడమే కాకుండా రక్తవృద్ధి కూడా కలుగుతుంది.