శనివారం, 16 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: గురువారం, 21 సెప్టెంబరు 2017 (13:31 IST)

మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇది తప్పనిసరి...

సబ్జా గింజల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. వేసవిలో చెమటకాయలు రాకుండా కాపాడుతుంది. చికెన్‌ఫాక్స్ వచ్చిన వారికి శరీర తాపం అధికంగా ఉంటుంది. పొక్కుల వల్ల మంట అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు సబ్జా గింజలు నీళ్ళలో నానబెట

సబ్జా గింజల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. వేసవిలో చెమటకాయలు రాకుండా కాపాడుతుంది. చికెన్‌ఫాక్స్ వచ్చిన వారికి శరీర తాపం అధికంగా ఉంటుంది. పొక్కుల వల్ల మంట అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు సబ్జా గింజలు నీళ్ళలో నానబెట్టి కొబ్బరి నీళ్ళలో కలిపి తాగితే సత్వర ఫలితం ఉంటుంది. అజీర్తి చేసిన వారికి ఈ గింజలు నానబెట్టిన నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి తాగిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. గ్లాసుడు నీళ్ళలో సబ్జా గింజల గుజ్జు వేసి మూడు, నాలుగుసార్లు తాగితే మంచి ఫలితం.
 
వీటి గుజ్జును పైనాపిల్, యాపిల్ జ్యూస్‌లలో కలిపి పిల్లల చేత తాగిస్తే శరీరంలో వేడి తగ్గిపోతుంది. అదే ధనియాల రసంతో ఇస్తే జ్వరం తగ్గుముఖం పడుతుంది. మహిళలు బరువు తగ్గాలనుకుంటే సబ్జాను నానబెట్టిన నీటిని తాగాలి. సబ్జా గింజలు నానబెట్టిన నీటిని నిద్రపోయే ముందు తాగితే చక్కటి ఫలితాలు ఉంటాయి. బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఈ నీటిని రాత్రి పూట తాగితే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి. అలాగే మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుతుంది.