చింతపండు గింజల రసం మంచి మౌత్ వాష్, ఎలాగ?
చింతపండు. ఈ చింతపండు గుజ్జు రసాన్ని వాడటం మామూలే. ఐతే చింతపండు గింజల ప్రయోజనాల గురించి తెలిస్తే వాటిని పారవేసే ముందు మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. చింతపండు గింజల్లో ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, అమైనో ఆమ్లాలు, విటమిన్లు వంటి ముఖ్యమైన ఖనిజాలు, పోషకాలతో సమృద్ధిగా వుంటాయి.
దగ్గు, టాన్సిల్స్, గొంతు ఇన్ఫెక్షన్ల నుంచి చింతపండు గింజలు కాపాడుతాయి. చింతపండు గింజల రసం మంచి మౌత్ వాష్ మాదిరిగా వాడొచ్చు. గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందడానికి దీనితో పుక్కిలిస్తే తగ్గిపోతుంది. టాన్సిల్స్, జలుబు, దగ్గు, ఇతర గొంతు ఇన్ఫెక్షన్లకు చింతపండు గింజల రసానికి కాస్త అల్లం, దాల్చినచెక్కను కలపవచ్చు.
చింతపండు గింజల రసం చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది. చింతపండు విత్తనం చర్మం మృదుత్వాన్ని అందిస్తుంది. ఇందులో హైలురోనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మానికి తేమను అందించడంలో సహాయపడుతుంది. చర్మంపై గీతలు, ముడతలను నివారిస్తుంది. చింతపండు విత్తనం నీటిలో కరుగుతంది. కనుక ఇది యాంటీ ఏజింగ్ ఫార్ములాగా కూడా పనిచేస్తుంది.