మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 14 మే 2017 (18:35 IST)

బరువు తగ్గాలని డైటింగ్ చేశారో? గోవిందా?

ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా అందానికే ప్రాముఖ్యత ఇస్తే అనారోగ్య సమస్యలు తప్పవు. ప్రతిరోజూ ఒక నిర్ణీత సమయానికి, పోషక విలువలు కలిగిన సమతుల ఆహారం తీసుకుంటూ, ఆహారం ద్వారా లభించే శక్తికి తగినంత వ్యాయామ

ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా అందానికే ప్రాముఖ్యత ఇస్తే అనారోగ్య సమస్యలు తప్పవు. ప్రతిరోజూ ఒక నిర్ణీత సమయానికి, పోషక విలువలు కలిగిన సమతుల ఆహారం తీసుకుంటూ, ఆహారం ద్వారా లభించే శక్తికి తగినంత వ్యాయామం చేస్తే ఖర్చవుతుంది. వ్యాయామం కానీ, శారీరక శ్రమ కానీ లేకుండా విశ్రాంతిగా ఉండేవారు నాజూగ్గానూ, సన్నగానూ, ఆరోగ్యంగానూ ఉండలేరు. 
 
తీసుకునే ఆహార విషయంలో కానీ, వ్యాయామం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. బరువు తగ్గాలని ఉపవాసాలుంటే.. అనారోగ్య సమస్యలే వేధిస్తాయి. ఆహారాన్ని తగ్గించడమంటే శరీరానికి లభించవలసిన విటమిన్స్, ప్రొటీన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ లాంటి పోషక పదార్థాలను అందించకుండా ఉంటే నీరసానికీ, బలహీనతకూ, ఆరోగ్య సమస్యలకు గురి కావడమేనని గుర్తించాలి.
 
ఉపవాసాలు చేయడంవల్ల పోషకాహార లోపంవల్ల వచ్చే ఇబ్బందులు తప్పవు. డైటింగ్ చేస్తే చర్మం పొడిబారిపోతుంది. రక్తహీనత ఏర్పడుతుంది. వెంట్రుకలు రాలిపోతూ, జుట్టు పలుచబడిపోతుంది. శారీరకంగా బలం తగ్గిపోతుంది. నీరసం, నిస్సత్తువ తప్పదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.