సంబంధిత వార్తలు
- ఏప్రిల్లో వారణాసికి రావొద్దు.. కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికేట్ చూపిస్తేనే..?
- మద్యం మత్తులో ఒంటిమీదున్న బట్టలన్నీ ఇప్పేశాడు.. అదీ విమానంలో..?
- సెలెబ్రిటీలు ఓవర్.. ఇక సీఎంల వంతు.. త్రిపుర సీఎంకు కరోనా
- ఇద్దరు బాలికలు .. 8 మంది యువకులు.. అడవిలోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్
- నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య, కారణం...?
వర్క్ ఫ్రమ్ హోం.. వెన్ను నొప్పి రాకుండా ఉండాలంటే..
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇపుడు ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుంచే పనులు చేస్తున్నారు. అదేసమయంలో అనేక మంది అనారోగ్యం బారినపడుతున్నారు. ముఖ్యంగా వెన్ను నొప్పి సమస్యను ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలో హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఆరోగ్యం విషయంలో తను జాగ్రత్తలు తీసుకుంటూనే నలుగురికి మంచిని చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉపాసన సారథ్యంలో యువర్ హెల్త్ వెబ్ సైట్ విశేష ప్రాచుర్యం పొందుతోంది.
దీని ద్వారా పలు టిప్స్ ఇస్తూ వస్తున్న ఉపాసన తాజాగా మరో క్రియేటివ్ వీడియోని ఇందులో షేర్ చేసింది. ఈ వీడియో ద్వారా వర్క్ ప్లేస్‌లో వెన్ను నొప్పి వస్తే దానిని ఎలా మేనేజ్ చేయాలో చూపించింది. దుప్పటాతో సింపల్‌గా వెన్ను నొప్పి రాకుండా ఇలా మేనేజ్ చేయొచ్చు అంటూ ఉపాసన షేర్ చేసిన వీడియోకు ఫుల్ ఆదరణ లభిస్తుంది.
గతంలో ఉపాసన.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సమంత, రష్మిక మంధాన, రకుల్ ప్రీత్ సింగ్ లతో ప్రత్యేక వీడియోలు రూపొందించగా, ఇందులో వారు హెల్తీ ఫుడ్ ఎలా చేసుకోవాలో తయారు చేసి చూపించిన విషయం విదితమే.
Here u go.
— Upasana Konidela (@upasanakonidela) April 16, 2021
Improve ur posture with a simple dupatta. https://t.co/vq6Q5RnQlg#fridayfitness #challenge #fridayfitnesschallenge @urlife_co_in pic.twitter.com/0dpmEJTnde
