శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (21:39 IST)

పుచ్చకాయ తింటున్నారు సరే, వాటి గింజలతో కలిగే ప్రయోజనం ఏంటో తెలుసా?

పుచ్చకాయ విత్తనాలను తినడం వల్ల ఈ ఆరు ముఖ్యమైన లాభాలు కలుగుతాయి. అవి ఏమిటో ఓ సారి చూద్దాం. 
 
1.  హైబీపీ ఉన్న‌వారు పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను తింటే బీపీ త‌గ్గుతుంది. బీపీ త్వ‌ర‌గా అదుపులోకి వ‌స్తుంది.
2. పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల కండ‌రాలు దృఢంగా మారుతాయి. అలాగే ఏదైనా పని చేసేటప్పుడు అలసట చాలా వరకు తగ్గుతుంది.
3.  మెదడు పనితీరు మెరుగ్గా ఉండాలంటే వీటని రోజూ తినాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
4. డ‌యాబెటిస్ (షుగర్) ఉన్న‌ వారు పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను తినడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
5. రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
6. కంటి చూపును మెరుగుప‌రిచే అద్భుత‌మైన ఔషధ గుణాలు పుచ్చ‌కాయ విత్త‌నాల్లో ఉంటాయట. కాబట్టి పుచ్చకాయ విత్తనాలను నిత్యం తింటున్నట్లయితే నేత్ర స‌మ‌స్య‌లు తగ్గుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.