ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 22 మార్చి 2024 (13:07 IST)

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తినకూడని 7 రకాల పండ్లు, ఏంటవి?

Mango
డయాబెటిస్. ఒకసారి వస్తే దాన్ని పూర్తిగా తగ్గించడం కష్టమని అంటారు. ఐతే క్రమబద్ధమైన ఆహారపుటలవాట్లు, వ్యాయామం చేస్తుంటే దాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. అలాగే కొన్ని రకాల పండ్లకు దూరంగా వుంటే శరీరంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో వుంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు ఏమిటో తెలుసుకుందాము.
 
ఒక మామిడికాయలో 46 గ్రాముల చక్కెర వుంటుంది కనుక దాన్ని తినరాదు.
కప్పు ద్రాక్షపండ్లలో 23 గ్రాముల షుగర్ వుంటుంది కనుక దూరం పెట్టాలి.
ఒక కప్పు చెర్రీ పండ్లలో 18 గ్రాముల చక్కెర వుంటుంది కాబట్టి తినకపోవడం మంచిది.
మధ్యస్తంగా వుండే బేరీ పండులో 17 గ్రాముల చక్కెర నిల్వలుంటాయి కనుక తినరాదు.
పుచ్చకాయ ఒకటి లేదా రెండు బద్దలు తినవచ్చు. అంతకుమించి తింటే 17 గ్రాముల చక్కెర చేరిపోతుంది.
రెండు అంజీర పండ్లు తింటే శరీరానికి 16 గ్రాముల చక్కెర లభిస్తుంది కనుక మితంగా తినాలి.
మధ్యస్తంగా వుండే ఓ అరటికాయలో 14 గ్రాముల షుగర్ వుంటుంది. తినాలనిపిస్తే సగం ముక్క తినాలి.