అల్పాహారానికి ముందు ఉదయం వేళ తినాల్సిన ఆహారాలు ఇవి
ఉదయం వేళ అల్పాహారంగా శరీరంలో జీవక్రియను పెంచే ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెపుతారు. అల్పాహారంగా దోసె, ఇడ్లీ వంటివి తీసుకుంటున్నప్పటికీ అంతకంటే ముందు కొన్ని పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతారు. అవేమిటో తెలుసుకుందాము.
బాదంపప్పును రాత్రంతా నీళ్లలో నానబెట్టి మరుసటిరోజు ఉదయాన్నే వాటి పొట్టు తీసి తినండి.
గోరువెచ్చని నీళ్లలో తేనె కలుపుకుని పరగడుపున తాగితే టాక్సిన్స్ సులభంగా బయటకు వెళ్లిపోతాయి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరచెంచా లెమన్ గ్రాస్ రసం తాగితే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
ఎండుద్రాక్షను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే పోషకాలను పూర్తిగా గ్రహించవచ్చు.
వేసవి వస్తుంది కనుక ఉదయాన్నే పుచ్చకాయ తింటే అవసరమైన హైడ్రేషన్ అందుతుంది.
చియా గింజలు కూడా ఉదయం వేళ మేలు చేసే ఆహారంగా చెప్పబడింది.
బొప్పాయి పండ్లను తింటుంటే శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది.
నిస్సత్తువగా వుంటుంటే ఉదయాన్నే అల్పాహారానికి ముందు ఉడికించిన కోడిగుడ్లు కూడా తినవచ్చు.