ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 21 జులై 2017 (21:59 IST)

ఆఫీసులో సిటింగ్ పొజిషన్ ఎలా వుంటోంది...? నడుము నొప్పికి లింకేంటి?

కార్యాలయాల్లో చాలామంది నడుము నొప్పి లేదా వెన్నునొప్పితో బాధపడుతుంటారు. దీనికి కారణం శరీరాన్ని మనం ఉపయోగించే తీరు. ఆఫీసుల్లో కూర్చుని పనిచేసేవారు ఇటువంటి నొప్పులకు గురవుతుంటారు. ఈ సమస్యను అధిగమించడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం... * బల్ల

కార్యాలయాల్లో చాలామంది నడుము నొప్పి లేదా వెన్నునొప్పితో బాధపడుతుంటారు. దీనికి కారణం శరీరాన్ని మనం ఉపయోగించే తీరు. ఆఫీసుల్లో కూర్చుని పనిచేసేవారు ఇటువంటి నొప్పులకు గురవుతుంటారు. ఈ సమస్యను అధిగమించడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం...
 
* బల్లకు వీలైనంత దగ్గరగా కుర్చీ ఉండాలి
* కుర్చీలో కూర్చున్నప్పుడు మీ రెండు పిరుదులు సమంగా కుర్చీకి ఆన్చి ఉంచాలి
* కుర్చీలో కూచుని హఠాత్తుగా పక్కకు తిరిగే ప్రయత్నం చేయకూడదు. పక్కకు తిరగాల్సి వస్తే శరీరమంతా తిప్పండి. అంతేకాని నడుము పైభాగాన్ని మెలితిప్పినట్టుగా తిరగవద్దు.
* ఒకే భంగిమలో గంటల తరబడి కూర్చుని పనిచేయవద్దు. అటూఇటీ కదులుతూ ఉండండి
* పని చేసేటపుడు మెడను పక్కకు వాల్చవద్దు. తిన్నగా ఉంచి చేయండి
* బల్లమీదికి శరీరం వంచి పని చేయవద్దు
* కాళ్లను వేళాడదీసి కూర్చోవద్దు. పాదాలకు అడుగున ఏదైనా పీట వంటిదాన్ని పెట్టుకోండి.