Daily Horoscope
✕

జీలకర్రతో పంచదార కలిపి నమిలి తింటే ఏమవుతుంది?

Written By సిహెచ్
Updated: మంగళవారం, 24 ఆగస్టు 2021 (23:24 IST)
ఒక స్పూన్ తేనెకు అర టీస్పూన్ జీలకర్ర పొడిని వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు పూటలా తీసుకోవడం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు. జీలకర్ర తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి, ఉదర సంబందిత సమస్యలను చాలావరకు తగ్గిస్తుంది.
 
ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని చల్లార్చి తీసుకున్నట్లయితే కడుపు నొప్పి సమస్యను తగ్గించుకోవచ్చు.
 
నిమ్మకాయ ఆరోగ్యానికి ఔషధం అని చెప్పవచ్చు. నిమ్మకాయలో జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ పుదీనా రసం మరియు ఒక స్పూన్ అల్లం రసం తీసుకుని దీనికి కొద్దిగా ఉప్పు కలిపి తీసుకున్నట్లయితే కడుపునొప్పి సమస్యను నివారించుకోవచ్చు.
 
ఇంగువ, యాలుకలు, శొంఠి, సైంధవ లవణం సమానంగా తీసుకుని మెత్తగా పొడిలాగా చేసుకుని ఉదయం సాయంత్రం అరస్పూన్ చొప్పున తీసుకుంటే ఆహారం సులభంగా జీర్ణమవడంతో పాటు కడపులోని గ్యాస్, కడుపు ఉబ్బరం తగ్గి శరీరం తేలికగా ఉంటుంది.
 
కడుపులో ఏర్పడే నొప్పిని తగ్గించడంలో బేకింగ్ సోడా అద్బుతంగా పని చేస్తుంది. బేకింగ్ సోడా ఆంటాసిడ్ గుణాలను కలిగి ఉంది. ఒక స్పూన్ బేకింగ్ సోడాను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగడం వలన కడుపునొప్పి త్వరగా తగ్గుతుంది.  
 
బొప్పాయిని చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఎండబెట్టి మెత్తటి పొడిలా చేసి రోజూ అరస్పూన్ పొడిని తగినంత తేనె కలిపి తీసుకుంటే కడుపునొప్పి, మలబద్దకం, అజీర్తి, వికారం, ఆకలి లేకపోవడం లాంటి ఉదర సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి.
 
పంచదార మరియు జీలకర్రను నమిలి తిన్నా మంచి ఫలితం ఉంటుంది. తులసి మరియు పుదీనా ఆకులను కలిపి నమిలినట్లయితే ఉదర సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడిని వేసి తీసుకున్నట్లయితే కడుపు ఉబ్బరం మరియు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. 

అన్నీ చూడండి

రసగుల్లా అనుకుని నాటు బాంబును కొరికేశాడు.. చివరకు...

2026 జనవరి-అక్టోబర్‌లో హైదరాబాద్ నివాస రిజిస్ట్రేషన్ల లావాదేవీ విలువ ఏడాదికి 3 శాతం వృద్ధి

కోల్‌కతా ఎయిర్ పోర్ట్ రన్‌వేపైకి వీధి కుక్క.. పైలట్ అలెర్ట్.. తప్పిన పెను ప్రమాదం

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. గత 24 గంటల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు

వైజాగ్ స్టీల్ సిటీ కాస్త సిలికాన్ సిటీగా మారుతోంది : కేంద్ర మంత్రి పియూష్ గోయల్

అన్నీ చూడండి

రియాలిటీ లోని ‘భజ గోవిందం’ పాటకు గొప్ప ఆదరణ : కిరణ్ అబ్బవరం

హైందవ నుంచి సాయి శ్రీనివాస్, సంయుక్త, పై రొమాంటిక్ మెలోడీ రిలీజ్

ట్రెండ్ కు తగినట్లు ఇంటెన్స్ యాక్షన్ మూవీస్ చేయడం ఇష్టం : మాయలేడీ హీరో రాకేష్ వర్రే

ఈఎన్ఈ రిపీట్ బతుకమ్మ పాట థియేటర్లో పండగలా ఉంటుంది: తరుణ్ భాస్కర్

వినూత్నంగా పారడాక్స్ హరికథ చిత్రం వుంటుంది :చిత్రయూనిట్

తర్వాతి కథనం
Show comments