బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 13 జులై 2021 (23:22 IST)

చక్కెర అధికంగా తీసుకుంటే కేశాలకు హాని కలుగుతుందా?

జుట్టుకు, ఆరోగ్యానికి చక్కెర చెడ్డది అంటున్నారు. మధుమేహం, ఊబకాయానికి దారితీసే ఇన్సులిన్ నిరోధకత కూడా జుట్టును కోల్పోయేలా చేస్తుంది. స్త్రీపురుషులలో బట్టతలకి దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇన్సులిన్ నిరోధకత వెనుక ఉన్న మొదటి అంశం చక్కెర, పిండి పదార్ధాలు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారం.
 
కేశాలు ప్రధానంగా కెరాటిన్ అని పిలువబడే ప్రోటీనుతో తయారవుతాయి. కెరాటిన్ జుట్టుకు నిర్మాణాన్ని ఇచ్చే ప్రోటీన్. ఆల్కహాల్ ప్రోటీన్ సంశ్లేషణపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. జుట్టు బలహీనపడటానికి, ఎటువంటి మెరుపు లేకుండా దారితీస్తుంది. అధికంగా మద్యం సేవించడం వల్ల పోషక అసమతుల్యత ఏర్పడుతుంది. ఫోలికల్ మరణానికి కారణమవుతుంది.
 
అలాగే కొందరు జంక్ ఫుడ్స్ తీసుకుంటుంటారు. ఇవి సంతృప్త, మోనోశాచురేటెడ్ కొవ్వులతో నిండి ఉంటాయి, ఇవి మిమ్మల్ని ఊబకాయం కలిగించడమే కాకుండా హృదయ సంబంధ వ్యాధులకు దారితీస్తాయి. అంతేకాదు జుట్టును కోల్పోయేలా చేస్తాయి. కనుక జంక్ ఫుడ్ దరిచేరనీయరాదు.