గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 16 ఆగస్టు 2021 (23:15 IST)

మెడ చుట్టూ పంచదార కలిసిన టమోటా రసం రాస్తే అవి తగ్గిపోతాయి

ఒక స్పూన్ పెరుగులో 5 చుక్కల నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని మెడ చుట్టూ మర్దనా చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయటం వలన మంచి ఫలితం ఉంటుంది.
 
బొప్పాయిని మెత్తగా పేస్టులా చేసి దానికి కొంచెం పసుపును కలిపి ప్రతిరోజు మెడ వెనుక భాగంలో మర్దన చేయాలి. ఇలా ప్రతి రోజు చేయడం వల్ల మెడ భాగం కాంతివంతంగా తయారవుతుంది.
 
ఒక టమోటాను తీసుకొని దాని మీద పంచదార చల్లి మెడచుట్టూ బాగా మర్ధన చేయాలి. ఈ మిశ్రమం ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా క్రమంతప్పకుండా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
 
కీరదోస కాయ ముక్కలను మెత్తగా చేసి దానికి కొంచెం తేనెను కలిపి ఆ మిశ్రమాన్ని మెడకు పూయాలి. ఇలా ప్రతి రోజు చేయడం వలన మెడ భాగం తెల్లగా అందంగా తయారవుతుంది.