శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: శనివారం, 10 జులై 2021 (23:01 IST)

నిమ్మ తొక్కపై కొంచెం చక్కెర వేసి దానిని...

టీ, కాఫీలు తాగడం వల్ల కూడా పెదవులు నల్లగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటికి బదులుగా గ్రీన్ టీ తీసుకుంటే మంచిది. ఇందులోని ఫాలీఫినాల్స్ శరీరంలోని ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి. అంతేకాదు వయసు పెరగడం, ఎండ వేడి వల్ల కమిలిపోయిన పెదాలకు రక్షణ కల్పిస్తాయి. టీ బ్యాగుల్నీ పెదాలపై మృదువుగా మర్దనా చేయడం వల్ల ఎండిపోయి పగిలిన పెదాలకు సాంత్వన లభిస్తుంది.
 
టొమాటోలో అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి. వీటిలో సెలినీయం అనే యాంటీఆక్సీడెంట్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది సూర్యకిరణాల నుండి మీ చర్మాన్ని, పెదవులను కాపాడుతుంది. కాబట్టి ప్రతిరోజు దీనిని ఏదో ఒక రూపంలో తీసుకునేలా చూసుకోవాలి. ఎండలో నుంచి రాగానే మీ పెదాలకు టొమాటో గుజ్జు లేదా రసం పూయడం వల్ల అవి తమ సహజ రంగును కోల్పోవు సరికదా తాజాగానూ ఉంటాయి.
 
ప్రతిరోజు చెంచా తేనె తీసుకోవాలి. ఇది మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే రాత్రుళ్లు పెదాలకు తేనె రాసుకుని మర్నాడు కడిగివేయాలి. తేనెలోని యాంటీ ఆక్సీడెంట్లు, మెగ్నీషియం లాంటి ఖనిజాలు ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు పెదాలపై ఉండే నలుపుదనాన్ని పోగొడతాయి.
 
పెరుగు మన శరీరానికి చలువ చేస్తుంది. దీనిలో మాంసకృత్తులు మీ చర్మాన్ని దృడంగా, నవయవ్వనంగా ఉంచుతాయి. దీనిని రోజూ మీ భోజనంలో తీసుకోవాలి. కాస్తంత పెరుగును చేత్తో తీసుకుని మీ పెదాలకు రాసుకున్నా అవి క్రమంగా మృదువుగా మారుతాయి. పిగ్మంటేషన్ సమస్యను కూడా తగ్గిస్తాయి.
 
గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. నిమ్మ సహజ బ్లీచ్ లా పని చేస్తుంది. నిమ్మ తొక్కపై కొంచెం చక్కెర వేసి దానిని పెదాలపై మృదువుగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల పెదవులపై నలుపు తగ్గుతుంది.