ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 3 జనవరి 2017 (11:57 IST)

శీతాకాలంలో చర్మానికి మేలు జరగాలంటే.. నీరు ఎక్కువగా తాగాలి

చలికాలంలో మహిళలు ఎన్ని జాగ్రత్తలు పాటించినా, ఎన్ని క్రీములు రాసుకున్నా... తగిన మోతాదులో నీరు తాగకపోతే మాత్రం చర్మానికి ప్రమాదమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలం పొడవునా వాతావరణం చల్లగా ఉంటుంది క

చలికాలంలో మహిళలు ఎన్ని జాగ్రత్తలు పాటించినా, ఎన్ని క్రీములు రాసుకున్నా... తగిన మోతాదులో నీరు తాగకపోతే మాత్రం చర్మానికి ప్రమాదమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలం పొడవునా వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి మంచినీళ్లు పదే పదే తాగాలనిపించదు. పైగా గాలిలో తేమ తక్కువ కాబట్టి శరీరం నుంచి బయటకు వెళ్లే నీటి శాతం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీంతో చర్మం మరింతగా పొడిబారి పోవడమూ తప్పదు. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే దాహం కాకపోయినా నీరు సేవిస్తూనే ఉండాలి. 
 
ఇక శీతాకాలంలో చర్మం పొడిబారుతుంది. శీతాకాలంలో నువ్వుల నూనె చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి నూనె పట్టించి సున్ని పిండితో గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. 
 
స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ముఖానికి క్రీమ్‌ రాసుకోవా . ముఖ్యంగా విటమిన్‌ ఇ ఉన్న క్రీములు వాడడం మంచిది. చలికాలంలో వచ్చే పగుళ్ళకు వేజలిన్‌ వాడటం ఉత్తమం. సాధారణ సబ్బుకు బదులు గ్లిజరిన్‌ సబ్బులు వాడటం మంచిది. రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా చేతులకు, కాళ్ళకు మాయిశ్చరైజర్‌ క్రీమ్‌ రాసుకోవాలి. వారానికి ఒకసారైనా వేడి చేసిన కొబ్బరినూనె లేదా నువ్వుల నూనెతో మసాజ్‌ చేసుకోవడం మంచిది.