రోజూ యోగా చేస్తే.. ఎంత ప్రయోజనమో తెలుసా? మధుమేహానికి.. పద్మాసనం...

Last Updated: శుక్రవారం, 21 జూన్ 2019 (11:55 IST)
రోజుకు అరగంట పాటు యోగా చేస్తే.. వ్యాధులను తరిమికొట్టవచ్చు. ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా యోగసనాలు వేయడం ద్వారా కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.. ఎలాంటి వ్యాధులకు చెక్ పెట్టవచ్చో క్లుప్తంగా తెలుసుకుందాం.. 
 
యోగా అనేది క్రమశిక్షణను అమలు చేస్తుంది. మనం మన మనస్సును నిగ్రహించుకుంటూ.. మనలోని ఆధ్యాత్మిక భావనను నిద్రలేపే ప్రయత్నమే 
 
యోగ. ఈ యోగా ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతుంది. 
 
క్రమంగా యోగా చేయడం ద్వారా మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తద్వారా మెదడు కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంటుంది.
అధిక రక్తపోటుకు చెక్ పెట్టాలంటే..  పశ్చిమోస్థాసనం, మస్త్యాత్థాసనం, శశంగాసనం చేయవచ్చు. 
ఆర్థరైటిస్‌కు సేతబంధాసనం, తడాసనం, శలపాసనం, దశాంకాసనం 
 
ఆమ్లాల ఉత్పత్తికి, పశ్చిమోస్థాసనం, సర్వాంగాసనం
పైల్స్‌కు పశ్చిమోస్థాసనం, వజ్రాసనం, మయూరాసనం, శశాంకాసనం, హలాసనం, సంగవంగాసనం. 
మధుమేహానికి.. పద్మాసనం, హలాసనం, చక్రాసనం, శలపాసనం 
 
హృద్రోగాలకు.. తడాసనం, శలాపాసనం, భుజంగాసనం 
మహిళల నెలసరి సమస్యలకు.. హలాసనం, ధనురాసనం 
ఆస్తమా.. పశ్చిమోస్థాసనం, శశాంకాసనం, మత్స్యాసనం వేయాలని యోగా నిపుణులు సెలవిస్తున్నారు. దీనిపై మరింత చదవండి :