Webdunia - Bharat's app for daily news and videos

Install App

40 మంది అతిథులతో నిరాడంబరంగా సీతారామ కళ్యాణం

Written By ఠాగూర్
Updated: గురువారం, 2 ఏప్రియల్ 2020 (17:35 IST)
తెలంగాణా రాష్ట్రంలోని భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు నిరాడంబ‌రంగా జ‌రిగాయి. కరోనా వైరస్‌ కారణంగా ఈ సారి భక్తజనం లేకుండానే సీతారామ కల్యాణం, పట్టాభిషేకం క్రతువులు పూర్తిచేశారు. 
 
ప్ర‌భుత్వం త‌ర‌పున మంత్రులు అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, పువ్వాడ అజ‌య్ కుమార్ శ్రీసీతారాముల స్వామివారికి ముత్యాల త‌లంబ్రాలు, ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు.  వైదిక పెద్దలు, అర్చకుల సమక్షంలో స్వామివారి కల్యాణం జ‌రిగింది.
 
ప్రతియేటా మిథిలా స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించేవారు. ఈసారి ఆలయంలోని మండపంలోనే రాములవారి కల్యాణ వేడుక నిర్వ‌హించారు. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ర‌మ‌ణాచారి, దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, వేదపండితులు, అర్చకులు, ఆల‌య‌, ఇత‌ర శాఖ‌ల అధికారులు ఈ వేడుకకు హాజ‌ర‌య్యారు.
 
మరోవైపు, కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలెవరూ హాజరుకావొద్దని ప్రభుత్వం సూచించింది. దీంతో భక్తులు లేకుండానే కల్యాణ వేడుకలను పూర్తిచేశారు. కేవలం 40 మంది ముఖ్యులు, వైదిక పెద్దలు, అర్చకుల సమక్షంలో సీతారాముల కల్యాణ వేడుకలు ముగిశాయి. 

అన్నీ చూడండి

బొద్దింకలు పబ్లిక్ గార్డెన్‌లో మీట్ అవుతున్నాయి: ఢిల్లీ పోలీసులకు స్థానికులు ఫిర్యాదు, వీడియో

ఈ పరికరం పేరేంటో చెప్పండి.. గూగుల్‌లో సెర్చ్ చేసిన డాక్టర్ (వీడియో)

అలా ఏమీ లేదు.. మీరు కొంచెం మారిపోయారు : ప్రధాని మోడీతో ఖర్గే సరదా సంభాషణ

జూబ్లీహిల్స్‌లోని ది వరల్డ్‌ స్వాతంత్య్ర దినోత్సవ ప్రచారం

ఏపీ సీఎం చంద్రబాబు ఓ విజనరీ లీడర్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

అన్నీ చూడండి

మహా కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు - రూ.210 కోట్లు మంజూరు

12-08-2026 బుధవారం మీ రాశి ఫలితాలు - రుణ ఒత్తిడితో మనశ్శాంతి ఉండదు..

ఆషాఢ అమావాస్య.. ఈ రోజున ఇంట్లో ప్రశాంతత చాలా ముఖ్యం.. ఆడంబరాలొద్దు..

11-08-2026 మంగళవారం మీ రాశి ఫలితాలు - తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది...

11 ఆగస్టు 2026, మంగళవారం పంచాంగం వివరాలు..

తర్వాతి కథనం
Show comments