తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లోక్ సభ స్పీకర్
లోక్ సభ స్పీకర్ సుమిత్రామహాజన్ శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. సుమిత్రా మహాజన్ గురువారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. ఆమెకు టీటీడీ ఈవో సాంబశివరావు, ఇతర అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. పద్మవతీ అతిథి గృహంలో వసతి ఏర్పాటు చేశారు.
శుక్రవారం తెల్లవారుజామున ఆలయానికి విచ్చేసిన ఆమెకు స్వాగతం పలికి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్పీకర్‌కు ఆలయ పండితులు ఆశీర్వచనం అందజేశారు. అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి, శేషవస్త్రం బహూకరించారు.