'స్టార్ వార్స్' సిరీస్ ఫేమ్ అండ్రూ జాక్ ఇకలేరు..

andrew jack
ఠాగూర్| Last Updated: బుధవారం, 1 ఏప్రియల్ 2020 (12:08 IST)
కరోనా వైరస్ మరో ప్రముఖ నటుడిని పొట్టనబెట్టుకుంది. స్టార్ వార్ సిరీస్ ఫేమ్‌గా గుర్తింపు పొందిన అండ్రూ జాక్‌ ఈ వైరస్ మహమ్మారికి కన్నుమూశారు. ఆయన వయసు 76 యేళ్లు. రెండు రోజుల క్రితం ఆయనకు జరిగిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆయన్ను ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, ఆయన సర్రేలోని ఆస్పత్రిలో ప్రాణాలు విడిచినట్టు వైద్యులు వెల్లడించారు.

ఈ విషయాన్ని ధ్రువీకరించిన ఆండ్రూ జాక్ ప్రతినిధి జిల్‌ మెక్ లాగ్‌, ఆయన మృతి తమకు తీరని లోటని అన్నారు. 'స్టార్‌ వార్స్‌' సీరీస్ 7, 8లో ఆండ్రూ జాక్ నటించారు. ఎంతో మందికి భాషపై మెలకువలు నేర్పారు. హాలీవుడ్ స్టార్ హీరోలు రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, క్రిస్ హేమ్స్‌ వర్త్‌‌లకు డయలెక్ట్‌ కోచ్‌ గానూ ఆయన వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం జాక్ భార్య గేబ్రియల్‌ రోజర్స్‌ ఆస్ట్రేలియాలో ఉన్నారు. భర్త మరణం గురించి తెలిసిన తర్వాత ఆమె స్పందిస్తూ, రెండు రోజుల క్రితం తన భర్తకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, ఆయన ఎటువంటి బాధా లేకుండా కన్నుమూశారని చెప్పుకొచ్చారు.దీనిపై మరింత చదవండి :