శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By ivr
Last Modified: మంగళవారం, 2 మే 2017 (15:15 IST)

అమెరికాలో సెక్సీ ప్రియాంకా చోప్రా గ్లామర్ షో(ఫోటోలు), ట్విట్టర్లో పేలుతున్న జోకులు

బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ క్వీన్ ప్రియాంకా చోప్రా అమెరికాలో తళుక్కుమంది. అమెరికాలో మెట్‌గాలా కాస్ట్యూమ్ ఇనిస్టిట్యూట్ ప్రతి సంవత్సరం నిర్వహించే షోలో ఆమె పాల్గొన్నది. ఈ షోలో జరిగే రెడ్ కార్పెట్‌లో ప్రియాంకా భారీ గౌన్‌తో దర్శనమిచ్చి చూపరుల దృష్టిని తనవైప

బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ క్వీన్ ప్రియాంకా చోప్రా అమెరికాలో తళుక్కుమంది. అమెరికాలో మెట్‌గాలా కాస్ట్యూమ్ ఇనిస్టిట్యూట్ ప్రతి సంవత్సరం నిర్వహించే షోలో ఆమె పాల్గొన్నది. ఈ షోలో జరిగే రెడ్ కార్పెట్‌లో ప్రియాంకా భారీ గౌన్‌తో దర్శనమిచ్చి చూపరుల దృష్టిని తనవైపు తిప్పేసుకుంది. హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్న ప్రియాంకా చోప్రా అంటే ఇప్పుడు అమెరికాలో విపరీతమైన క్రేజ్ వుంది. 
 
ప్ర‌స్తుతం ఆమె అమెరికా టీవీ సీరియ‌ల్ క్వాంటికోలో న‌టిస్తున్న సంగతి తెలిసిన విషయమే. కాగా ఆమె వేసుకున్న డ్రెస్ పైన ట్విట్టర్లో జోకులు పేలుతున్నాయి. గౌను వెనుక జీరాడుతూ వుండటంపై కొందరు ఇది స్వచ్ఛ్ భారత్ కు బాగా పనికివస్తుందంటూ సెటైర్లు విసురుతున్నారు. చెత్త,చెదారాన్ని ప్రియాంకా తన గౌనుతో ఎంచక్కా కష్టపడకుండా ఊడ్చేయవచ్చంటూ జోకులు పేలుస్తున్నారు. ఆమె రెడ్ కార్పెట్ పైన నడిచిన ఫోటోలు చూడండి.