శనివారం, 16 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By chj
Last Modified: శనివారం, 22 జులై 2017 (22:52 IST)

గ్లాసుడు మామిడిపళ్ల రసంలో అరగ్లాసు క్యారెట్ రసాన్ని కలిపి...

కిడ్నీ సంబంధ సమస్యలతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. వాటిని నయం చేసుకునేందుకు ఆస్పత్రులకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అయితే, మూత్రపిండాల్లోని రాళ్ళను ఇంట్లోనే పెరటి వైద్యంతో నయం చేయవచ్చని గృహ వైద్యులు చెపుతున్నారు.

మూత్రపిండాలలో రాళ్ళున్నవారు ఒక గ్లాసు మామిడి పళ్ళ రసంలో అరగ్లాసు క్యారెట్ రసాన్ని కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. ఇలా రెండు నెలలు తీసుకుంటే మూత్రపిండంలోని రాళ్ళు కరిగిపోయి, ఇకపై రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఇలా ప్రతిరోజూ సేవిస్తుంటే పూర్తి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చర్మం కాంతివంతంగా ఉంటుందని వైద్యులు తెలిపారు. 
 
మామిడి పండులో విటమిన్ ఎ అధికంగా ఉంది. ఇది రేచీకటి రాకుండా కాపాడుతుంది. కాగా ఇంకా కొన్ని దృష్టి లోపాలను కూడా నివారిస్తుంది. అంతేగాకుండా కనుపాపలను తడిగా వుంచి, కంటి నుంచి నీరు రావడం, కంటిమంట, దురదలు రాకుండా కాపాడుతుందని వైద్యులు చెపుతున్నారు.