బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 25 జులై 2023 (23:12 IST)

మునగాకు సూప్ ఉదయాన్నే పరగడుపున తాగవచ్చా? (video)

మునగాకు సూప్. ఇది ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. అంతేకాదు మునగ పూలు, మునగ కాయలు ఆరోగ్యపరంగా మేలు చేస్తాయి. ముఖ్యంగా మునగాకు సూప్ తాగితే కలిగే ప్రయోజనాలు, ఎప్పుడు తాగకూడదో తెలుసుకుందాము. మునగాకు రసం నేత్ర రోగాలను, వాత, పైత్య దోషాలను, విషాలను హరిస్తుంది. మునగాకు సూప్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది కానీ వారానికి ఒకట్రెండు సార్లు కంటే మించి తాగరాదు.
 
మునగాకు సూప్ ఉదయాన్నే పరగడుపున ఎట్టి పరిస్థితుల్లో తాగరాదు. లేత మునగ ఆకు కూర వండుకుని తింటుంటే పురుషులకు శక్తినిస్తుంది. మునగ కాయలు, ఆకులు కూరగా చేసుకుని తింటే స్త్రీలకు శరీరంలో చెడునీరు తొలగుతుంది.
 
మునగ ఆకు రసాన్ని గర్భిణీ స్త్రీలు, పిల్లలు తాగరాదు. మునగాకు, వసకొమ్ము, వాము సమంగా కలిపి దంచి నూనెలో ఉడకబెట్టి గాయాలకు, దెబ్బలకు కడితే మానుతాయి.