Daily Horoscope
✕

ఈ చెట్టు ఆకుతో అధిక బరువును కంట్రోల్ చేయవచ్చు...

Written By సిహెచ్
Updated: సోమవారం, 11 అక్టోబరు 2021 (23:02 IST)
ఇటీవలి కాలంలో అధిక బరువు సమస్యతో బాధపడే వారు ఎక్కువవుతున్నారు. ఇలాంటి వారు ఆ సమస్యను వదిలించుకునే చిట్కాలు వున్నాయి. మీ పెరట్లో జామచెట్టు గనుక ఉంటే ఇక మీరు ఎలాగోలా కాస్త బరువు తగ్గడమేకాదు.
 
చక్కగా మీ శరీరంలోని చెడు కొలెస్టరాల్‌ను కూడా తరిమేయవచ్చు. ఎలాగంటే గుప్పెడు జామ ఆకులను కడిగి, కొద్దిగా నీటిని మరిగించి అందులో వేసి చల్లార్చితే జామాకుల టీ తయారవుతుంది. ఈ టీని తాగడం వల్ల బోలెడు మంచి ఫలితాలు ఉంటాయట.
 
ఈ టీ రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిలను అదుపులో ఉంచుతుంది, ఇంకా శరీరంలోని చెడు కొలెస్టరాల్‌ను కరిగించే శక్తి ఉంది, ఫలితంగా బరువు తగ్గుతారు.
 
జామాకుల టీని తాగితే శ్వాస సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి. జామాకులను శుభ్రంగా కడిగి వాటిని నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గుతాయి, నోటిపూత కూడా తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నొప్పులు, వాపులను నివారించే గుణాన్ని కలిగివుంటాయి. కాబట్టి కాస్త వగరుగా ఉన్నా నెలకు ఒకసారైనా జామాకుల టీని తాగి చూడండి.

అన్నీ చూడండి

అర్నబ్ తుఫాను ప్రభావంపై రిలయన్స్ ఫౌండేషన్ స్పందన: మత్స్యకార పడవల పునరుద్ధరణ కార్యక్రమం ప్రారంభం

హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థి ఆత్మహత్య.. ప్రిన్సిపాల్ వేధింపులే కారణమా?

మధ్యంతర ఫలితాలపై ఖంగుతిన్న ట్రంప్ - వైట్‌‍హౌస్‌లో కీలక మార్పు

ఏపీ పరిషత్ ఎన్నికల్లో సాఫీగా కౌంటింగ్.. కూటమి జోరు

లగ్జరీ హోటల్ గదిలో అమెరికన్ పౌరుడు మృతి.. ఏం జరిగింది?

అన్నీ చూడండి

Dhanush apology :నా పాటను పక్కన పెట్టంది సాయి అభ్యంకర్ మాత్రమే - మరోవైపు ధనుష్ క్షమాపణలు

కిల్లర్ మూవీ కోటి కాంటెస్ట్ లో ఎవరూ విన్ కాలేదు, కానీ...బహుమతి ఇస్తున్నాం - డైరెక్టర్ పూర్వాజ్

Neha Sshetty: సాయి శ్రీనివాస్, నేహా శెట్టి ల మధ్య మదరాసి రబ్బరు బొమ్మ రొమాంటిక్ కు ఆదరణ

రాముడికి 14 యేళ్ల వనవాసం - నా వనవాసం ఎపుడు ముగుస్తుంది : రేణూ దేశాయ్

55 years Trivikram Srinivas :జేబులో చేతులు పెట్టుకుని అలా.. 55వ పుట్టినరోజు కు చేరుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్

తర్వాతి కథనం
Show comments