బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 8 అక్టోబరు 2021 (22:56 IST)

మొటిమ కలవరం పెడుతుందా?

ఆడపిల్లలకు  ముఖంపై  చిన్న  మొటిమ  కనిపిస్తే  చాలు... అంతులేని బాధ,  వయసుతో  సంబంధం  లేకుండా  వచ్చే  ఈ  సమస్యను  ఇంటి  చిట్కాలతో  తగ్గించుకోవచ్చు.
 
అదెలాగంటే !
కమలాఫలంలో  ఉండే  శాలిసిలిక్  ఆమ్లం  మొటిమల్ని  నిరోధిస్తుంది.  రెండు  చెంచాల  కమలాఫలం రసంలో  చెంచా  తేనె  కలిపి  ముఖానికి  పూతలా  వేసుకోవాలి.  పది నిమిషాలయ్యాక  గోరు వెచ్చని  నీళ్ళతో  శుభ్రం  చేసుకోవాలి.  వారానికోసారి  ఇలా చేస్తే  ఫలితం  ఉంటుంది.
 
రెండు చెంచాల  తేనెలో  చిటికెడు  దాల్చిన చెక్కపొడి,  కొద్దిగా  నిమ్మ రసం  కలిపి  ముఖానికి  రాసుకోవాలి.  పది నిమిషాల  తరువాత  చల్లని నీటితో  కడిగితే,  చర్మ గ్రంధులు  శుభ్రపడి,  మొటిమలు  తగ్గుముఖం  పడతాయి. 
 
బొప్పాయిలో  ఎ, సి  విటమిన్లు  అధికంగా  ఉంటాయి. ఇవి  జిడ్డుని  ఆదుపులో  ఉంచుతాయి.  బొప్పాయి  గుజ్జుని  ముఖానికి  లేపనంలా  రాసి  ఇరవై నిమిషాల  తరువాత  గోరు వెచ్చని  నీళ్లతో  కడగాలి.  ఇలా  తరచూ  చేస్తే  మార్పు  కనిపిస్తుంది.  ముఖచర్మం కాంతులీనుతుంది.