మంగళవారం, 5 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 డిశెంబరు 2020 (16:07 IST)

ఆముదం వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? (video)

ఆముదం... చెట్టు గింజ‌ల నుంచి ల‌భిస్తుంది. ఇది ఎన్నో స‌మ‌స్య‌ల‌కు నివార‌ణిగా ప‌నిచేస్తోంది. చర్మంతో పాటు జుట్టుకు సంబంధించిన అనేక రకరకాల సమస్యల‌ను దూరం చేయ‌డంలో ఆముదం పాత్ర అగ్ర‌స్థానం. మృదువైన శిరోజాలు సొంతం కావాలంటే... ఆముదం వల్లే సాధ్యం. 
 
ఇందులో రిసినోలిస్ యాసిడ్ సంవృద్ధిగా ఉంటుంది, ఇది యాంటీఇన్ఫ్లమేటరి, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది అందమైన శరీరానికి దోహదం చేస్తుంది. 
 
ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకునేందుకు బాగా పనిచేస్తాయి. గుండె జబ్బులు, విషజ్వరం, కుష్టు, దురద, వాపు, నులిపురుగులు, మలమూత్ర సంబంధ సమస్యలను సులువుగా నివారిస్తుంది. 
 
 

* చర్మాన్ని తెల్లగా, కాంతివంతంగా మారుస్తుంది. 
* మొటిమలను, మచ్చలను తగ్గిస్తుంది. 
* పగిలిన పెదవులను మృదువుగా చేస్తుంది. 
* కళ్ళ చుట్టూ నల్లని వలయాలను తగ్గిస్తుంది. 
* ముఖంపై ఏర్పడే నల్లని మచ్చలను (పిగ్మెంటేషన్) తగ్గిస్తుంది. 
* స్ట్రెచ్ మార్స్క్‌ను తగ్గించి చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. 
* వయసు పెరగడం వల్ల వచ్చే మడతలను తగ్గిస్తుంది. 
* చర్మాన్ని తేమగా ఉంచుంది. 
* చర్మంపై వచ్చే అసాధారణ మచ్చలను తగ్గిస్తుంది. 
* జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. 
* చుండ్రును నివారిస్తుంది. 
* మలబద్దకాన్ని నివారిస్తుంది. 
* కీళ్ళనొప్పి, మోకాలు నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 
* వెన్ను నొప్పిని తగ్గిస్తుంది.